నరేంద్ర మోదీ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ(నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) ఆరోపించింది. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు దిల్లీ యూనివర్సిటీలో 'షూ పాలిష్' కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా ఇదేతరహా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పాలనపై తమ నిరసనను తెలియజేసింది.
కేంద్ర ప్రభుత్వం దేశ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన హామీలు నెరవేర్చలేదని ఎన్ఎస్యుఐ నేతలు ఆరోపించారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.