ఎయిర్సెల్- మ్యాక్సిస్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై నేడు ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి.
బెయిల్ మంజూరు చేయొద్దని చిదంబరం వినతికి వ్యతిరేకంగా ఇప్పటికే వాదనలు వినిపించాయి సీబీఐ, ఈడీ. కేసు దర్యాప్తునకు చిదంబరం ఆటంకం కల్గిస్తారని ఆరోపించాయి.
చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఎయిర్సెల్, మ్యాక్సిస్ సంస్థల మధ్య రూ.3,500 కోట్లు విలువైన ఒప్పందం జరిగింది. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరు చేయడంలో భారీ అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ.
ఇదీ చూడండి:- కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్యలకు పాక్ విశ్వప్రయత్నాలు