ETV Bharat / bharat

అట్టుడికిన దిల్లీ.. పౌర హింసలో ఐదుగురు మృతి - పౌర చట్టానికి వ్యతిరేకంగా హింస

దిల్లీ మరోసారి రణరంగంగా మారింది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. సోమవారం జరిగిన నిరసనలు హింసకు దారితీశాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్ల సమయంలో.. గోకుల్​పురి వద్ద టైర్​ మార్కెట్​కు నిప్పంటించారు కొందరు ఆందోళనకారులు. హింస జరిగిన ప్రాంతాల్లో నేడు పాఠశాలలకు బంద్​ ప్రకటించారు.

Delhi violence: Mob sets tyre market on fire, blaze brought under control
అట్టుడికిన దిల్లీ.. పౌర హింసలో నలుగురి మృతి
author img

By

Published : Feb 25, 2020, 5:23 AM IST

Updated : Mar 2, 2020, 11:51 AM IST

అట్టుడికిన దిల్లీ.. పౌర హింసలో ఐదుగురు మృతి

దేశ రాజధానిలో ట్రంప్​ పర్యటించనున్న వేళ మరోసారి పౌరసత్వ అల్లర్లు చెలరేగాయి. సోమవారం రాత్రి చెలరేగిన హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

పౌరసత్వ చట్టం అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దిల్లీ సోమవారం మరోసారి అట్టుడికింది. ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలకు ఓ హెడ్​ కానిస్టేబుల్​ సహా ఐదుగురు బలయ్యారు. నిరసనకారులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. ఆస్తులకు నిప్పుపెట్టారు. పెట్రోల్​ బంకు సహా ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులనూ వదల్లేదు. వారిపై రాళ్ల వర్షం కురిపించారు. రెండు రోజులుగా సాగుతున్న నిరసనలతో దిల్లీలోని జాఫ్రాబాద్​, మౌజ్​పుర్​లు దద్దరిల్లాయి. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టారు.

అల్లర్లలో ఓ హెడ్​ కానిస్టేబుల్ రతన్​ లాల్​ మరణించాడు. మరో నలుగురు పౌరులు కూడా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో 105 మంది గాయపడ్డారు. జాఫ్రాబాద్​లో ఓ ఆందోళనకారుడు తుపాకీతో కొన్ని రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.

మార్కెట్​కు నిప్పు...

ఈశాన్య దిల్లీలో జరిగిన పౌర చట్ట వ్యతిరేక ఆందోళనల్లో హింస చెలరేగిన సమయంలోనే.. గోకుల్​పురి వద్ద టైర్​ మార్కెట్​కు ఆందోళనకారులు నిప్పంటించారు. రాత్రి 8.30కు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 15 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి 12 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలు షాపులు దగ్ధమయ్యాయి.

పాఠశాలలు బంద్​..

ఈశాన్య దిల్లీలోని హింస జరిగిన ప్రాంతాల్లో నేడు పాఠశాలలకు బంద్​ ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా మీడియాకు వెల్లడించారు. పరీక్షలన్నీ వాయిదా వేసుకోవాలని పాఠశాలలకు సూచించారు.

మెరైన్​ డ్రైవ్​ వద్ద ఆందోళన...

దిల్లీ హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా ముంబయి మెరైన్​ డ్రైవ్​ వద్ద ప్రజలు సోమవారం అర్ధరాత్రి భారీగా గుమికూడారు. కొవ్వొతులతో శాంతియుత నిరనసలు చేశారు. అయితే.. పోలీసులు వారిలో కొందరిని నిర్బంధించారు. స్థానికులకు ఇబ్బంది తలెత్తుతుందని వారిని అక్కడి నుంచి పంపించారు.

ఎల్జీ ఇంటికి ఆప్​ నేత..

దిల్లీలో శాంతియుత పరిస్థితులపై లెఫ్టినెంట్​ గవర్నర్​ను కలిసేందుకు అర్ధరాత్రి ఆయన నివాసానికి చేరుకున్నారు ఆప్​ నేత, మంత్రి గోపాల్​ రాయ్​. పోలీసులను మోహరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాసేపటికి.. దిల్లీ పోలీస్​ కమిషనర్​ హామీ మేరకు అక్కడి నుంచి వెనుదిరిగారు ఆప్​ నేత.

Last Updated : Mar 2, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.