దిల్లీ అల్లర్లపై శివసేన ఘాటుగా స్పందించింది. రాజధానిలో జరుగుతున్న రక్తపాతానికి ఎవరు బాధ్యత వహిస్తారని భాజపాను ప్రశ్నించింది. ప్రస్తుతం దిల్లీలో నెలకొన్న పరిస్థితి 1984 నాటి అల్లర్లపై తీసిన హారర్ సినిమాను తలపిస్తోందని అభిప్రాయపడింది. దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా హింస చెలరేగడం బాధాకరమని తన అధికారిక వార్తా పత్రిక 'సామ్నా'లో రాసుకొచ్చింది శివసేన.
హింసకు అవకాశం ఉందని తెలిసినా.. తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది శివసేన. వందలాది ప్రాణాలు కోల్పోయిన సిక్కుల ఊచకోత ఘటనకు భాజపా ఇప్పటికీ ఇందిరాగాంధీనే నిందిస్తోందని గుర్తుచేసింది. తాజా హింసకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది.
ఇది దేశానికే అప్రతిష్ఠ...
దేశంలో సీఏఏ వ్యతిరేక ఆందోళలు జురుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రధాని మోదీ దిల్లీకి ఆహ్వానించడం సరికాదని పేర్కొంది శివసేన. ఈ చర్య దేశాన్ని అప్రతిష్ఠ పాలు చేసిందని ఆరోపించింది.
ఇదీ చదవండి: దిల్లీ అల్లర్లలో మద్యం దుకాణం లూటీ- ఆ తర్వాత!