ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లలో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక సురక్షితం

ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లలో సోమవారం తప్పిపోయిన 13 ఏళ్ల బాలికను పోలీసులు గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఇవాళ బాలికను మేజిస్ట్రేట్​ కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

Delhi violence: Class 8 girl missing since Monday reunited with family
దిల్లీ అల్లర్లలో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక సురక్షితం
author img

By

Published : Feb 28, 2020, 6:37 PM IST

Updated : Mar 2, 2020, 9:25 PM IST

ఈశాన్య దిల్లీ అల్లర్ల సమయంలో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. పోలీసులు బాలిక వాగ్మూలం కోసం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

దిల్లీ సోనియా విహార్​కు చెందిన 13 ఏళ్ల బాలిక సోమవారం 8వ తరగతి పరీక్షలు రాయడం కోసం పాఠశాలకు వెళ్లింది. ఖాజురిఖాస్​లో ఉన్న పాఠశాలకు ఆమె ఇంటికి మధ్య ఉన్న దూరం 4.5 కిలోమీటర్లు.

రెడీమేడ్ వస్త్రాల వ్యాపారం చేసే బాలిక తండ్రి సాయంత్రం 5.20 గంటలకు ఆమెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఆయన చిక్కుకుపోయారు. బాలిక కూడా పాఠశాల నుంచి ఇంటికి వస్తూ దారిలో తప్పిపోయింది. చివరికి ఇవాళ బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లతో ఈశాన్య దిల్లీ అట్టుడికింది . ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: బటన్​ నొక్కినా కరోనా వస్తుందని వాయిస్ కంట్రోల్​ లిఫ్ట్​

Last Updated : Mar 2, 2020, 9:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.