ETV Bharat / bharat

'పౌర' సెగ: దిల్లీ మళ్లీ హింసాత్మకం- నేతలు, విద్యార్థులు అరెస్ట్​

author img

By

Published : Dec 19, 2019, 1:39 PM IST

Updated : Dec 19, 2019, 6:31 PM IST

దేశ రాజధాని దిల్లీ.. పౌరసత్వ చట్టంపై వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతోంది. విద్యార్థులు, కార్యకర్తల ర్యాలీలతో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్​ విధించారు అధికారులు. ఈ క్రమంలో ఎర్రకోట ప్రాంతంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మండి హౌస్​ ప్రాంతంలో ర్యాలీ చేపట్టిన లెఫ్ట్​ పార్టీ అగ్రనేతలనూ అదుపులోకి తీసుకున్నారు.

Delhi set to witness multiple anti-CAA protest marches
'పౌర' సెగ: దిల్లీ మళ్లీ హింసాత్మకం- నేతలు, విద్యార్థులు అరెస్ట్​

'పౌర' సెగ: దిల్లీ మళ్లీ హింసాత్మకం- నేతలు, విద్యార్థులు అరెస్ట్​

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనతో దేశ రాజధాని దిల్లీ మహానగరం మరోమారు రణరంగంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. పౌర చట్టానికి వ్యతిరకేంగా, జామియా ఇస్లామియా, అలీగఢ్​ ముస్లిం వర్శిటీలో పోలీసుల చర్యను నిరసిస్తూ.. విద్యార్థులు, కార్యకర్తలు ర్యాలీలకు పిలుపునిచ్చిన క్రమంలో పలు ప్రాంతాంల్లో ఆంక్షలు విధించారు అధికారులు.

ఎర్రకోట ప్రాంతంలో 144 సెక్షన్​..

విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో ఎర్రకోట ప్రాంతంలో 144 సెక్షన్​ విధించారు అధికారులు. అయితే.. ఆంక్షలు లెక్కచేయకుండా జామియా, జేఎన్​యూ, దిల్లీ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఎర్రకోట ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంక్షలను లెక్క చేయకుండా ఎర్రకోట ప్రాంతంలో ఆందోళనకు దిగిన వందల మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యార్థులు, కార్యకర్తలను అరెస్ట్​ చేసి వివిధ పోలీస్​ స్టేషన్లకు తరలించారు. ఇందులో స్వరాజ్య అభియాన్​ అధినేత యోగేంద్ర యాదవ్​ ఉన్నారు.

వామపక్ష నేతల అరెస్ట్​..

సెంట్రల్​ దిల్లీలోని మండి హౌస్​ ప్రాంతంలో సంయుక్త మార్చ్​ నిర్వహించాయి లెఫ్ట్​ పార్టీలు. ఈ సందర్భంగా వామపక్ష​ నేతలు డి. రాజా, సీతారాం ఏచూరి, నిలోత్పల్​ బసు, బృందా కారత్​ సహా ఇతరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

16 మెట్రో స్టేషన్ల మూసివేత..

పౌర చట్టం వ్యతిరేక అల్లర్లు ఉద్రిక్తంగా మారిన క్రమంలో దిల్లీ మెట్రో రైల్​ కార్పోరేషన్​ భద్రత చర్యలు చేపట్టింది. నగరంలోని 16 మెట్రో స్టేషన్లలోని ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేసింది.

సీలంపుర్​లో మరో 12 మంది అరెస్ట్​

పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ గత మంగళవారం ఈశాన్య దిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో 12 మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు. ఇందులో ఐదుగురు జఫ్రబాద్​, నలుగురు దయాల్​ పుర్​ కేసుకు సంబంధం ఉన్నవారిగా పేర్కొన్నారు. గత మంగళ, బుధవారాల్లో 9 మందిని అరెస్ట్​ చేశారు.

భారీగా ట్రాఫిక్​ జాం

ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తాయి. దిల్లీ-గుర్​గావ్​, దిల్లీ గేట్​-జీపీఓ, సుభాష్​ మార్గ్​, పీలి కోఠి, శ్యామ ప్రశాద్​ ముఖర్జీ మార్గ్​, ఎర్రకోట, పాత దిల్లీ రైల్వే స్టేషన్​ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేయడం వల్ల మరింత ఆలస్యమవుతుంది.

ఇదీ చూడండి: భారత్​లో శాంతిని చూడలేకే చొరబాట్లు: అమిత్ షా

RESTRICTIONS SUMMARY:
AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 18 December 2019
1. Exterior of cafe with election countdown clock
2. "Impeach Trump" sticker on cafe window
3. "The People Have Spoken: Impeach" poster on cafe door
4. Group gathered in cafe watches impeachment vote
5. Independent voter Bo Sanders watches impeachment vote
6. Sanders side profile shot watching hearing
7. SOUNDBITE (English) Bo Sanders, Independent (29-year-old from San Francisco)
"When they were voting I actually felt nervous, kind of like, what's going to happen? I did expect the vote to pass for both the first article and the second article so that's pretty exciting but I kind of want to hold my excitement until the Senate happens because I think a lot of people are waiting to hear what happens there. But so for so good."
8. Another viewer watches impeachment vote
9. SOUNDBITE (English) Mary Anto, Democrat (25-year-old from San Francisco):
"I'm really happy the Democrats decided to make a statement and impeach Trump and not let him get away with all the things he's been doing. I think there's a danger of people being desensitized and the norm shifting, the moral ground shifting to things that are really unacceptable."
10. Impeachment vote on overhead TV at cafe
11. Another voter nods approval while vote is read
12. SOUNDBITE (English) Gardenia Zuniga-Haro, Democrat (29-year-old from San Francisco):
"I do hope that there's a better tomorrow for my future and my children but I also just hope that there's actually peace in our Congress because right now it's pretty embarrassing what's going on in our White House. But also traveling and saying you're American, they look down on us and I do not ever want to be looked down on for being an American."
13. More people watch impeachment vote
-------------
STORYLINE
Reaction amongst dozens of Democrats watching Wednesday's House impeachment hearing at a progressive cafe in San Francisco was solemn as most in attendance said they realize it's unlikely the Senate will follow suit.
Still, most said they believed it was important for Democrats to send an anti-corruption message with the vote.
Pro-impeachment stickers and posters could be seen all over Manny's Cafe in the city's Mission District.
An electric clock outside the cafe, which often hosts political discussions, counts down to the 2020 election.
President Donald Trump was impeached by the U.S. House of Representatives, becoming only the third American chief executive to be formally charged under the Constitution's ultimate remedy for high crimes and misdemeanors.
The historic vote split along party lines, much the way it has divided the nation, over the charges that the 45th president abused the power of his office by enlisting a foreign government to investigate a political rival ahead of the 2020 election.
The House then approved a second charge, that he obstructed Congress in its investigation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 19, 2019, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.