ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లలో.. జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్, వర్సిటీ పరిశోధక విద్యార్థి షార్జిల్ ఇమామ్, ఫైజన్ ఖాన్‌పై అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది దిల్లీ పోలీసు విభాగం. ఈ ఘటనలో మారణాయుధాలను వినియోగించడాన్ని 'ఉగ్ర కార్యకలాపాలు'గా అభివర్ణించింది.
"సీఏఏ, ఎన్ఆర్సీని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు.. తుపాకులు, పెట్రోల్ బాంబులు, యాసిడ్, మారణాయుధాలను ఉపయోగించి పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. మరో 208 పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఇది కచ్చితంగా ఉగ్రకార్యకలాపాల్లో భాగమే."
--- దిల్లీ పోలీసు విభాగం.
ఈ అల్లర్లలో ప్రజా వ్యవస్థ దెబ్బతిందని, నిత్యవసరాల సరఫరాకు ఆటంకం కలిగిందని పేర్కొన్న పోలీసులు.. ఇవన్నీ చూస్తే కచ్చితంగా ఉగ్రవాద కార్యకలాపాలేనని స్పష్టమవుతున్నట్టు పేర్కొన్నారు.
దిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 748 మంది గాయపడ్డారు. ప్రజా, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం కలిగింది.
ఇదీ చూడండి:- దిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర