ETV Bharat / bharat

దిల్లీలో ఎన్​కౌంటర్​- నలుగురు నేరస్థులకు గాయాలు

దిల్లీ బేగం ఫుర్​ పోలీస్​​ స్టేషన్​ పరిధిలోని దీప్​ విహార్​ ప్రాంతంలో పోలీసులు, నేరస్థులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు క్రిమినల్స్​కు గాయాలయ్యాయి. అనంతరం.. వారిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.

Delhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides
దిల్లీలో ఎన్​కౌంటర్​- నేరస్థులకు గాయాలు
author img

By

Published : Oct 8, 2020, 10:21 AM IST

Updated : Oct 8, 2020, 11:41 AM IST

దిల్లీలోని బేగం పుర్​ ప్రాంతంలో దిల్లీ పోలీసులు, నేరస్థులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు క్రిమినల్స్​కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి సమీపంలోని బాబా సాహెబ్​ అంబేడ్కర్​ ఆసుపత్రికి తరలించారు. నిందితుల నుంచి 6 తుపాకీలు, 3 బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Delhi Police nabs four criminals following encounter, over 50 rounds fired by two sides
భారీగా ఆయుధాలు స్వాధీనం

నేరస్థులను... లారెన్స్​ బిష్ణోయ్​ ముఠాకు చెందినవారిగా గుర్తించారు. ప్రత్యర్థి ముఠాపై దాడి చేసేందుకు వెళ్తున్నారన్న సమాచారం అందగా.. ఈ ఆపరేషన్​ చేపట్టినట్లు వివరించారు పోలీసులు.

నిందితుల నుంచి తుపాకీ లభ్యం

ఉదయం 3.30 గంటల సమయంలో నిందితులు కారులో పారిపోయేందుకు ప్రయత్నించగా.. కాల్పులు జరిపినట్లు తెలిపారు.

నిందితులందరిపైనా ఇదివరకే.. హత్య, హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Oct 8, 2020, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.