ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లపై దర్యాప్తు ముమ్మరం.. 2 ప్రత్యేక బృందాల ఏర్పాటు - Delhi Police

ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకోసం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కేసుల దర్యాపును నేర విభాగానికి బదిలీ చేసింది.

Delhi Police forms two SITs to probe northeast Delhi violence
దిల్లీ అల్లర్లపై రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు
author img

By

Published : Feb 27, 2020, 8:55 PM IST

Updated : Mar 2, 2020, 7:19 PM IST

ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు రెండు ప్రత్యేక బృందాల(సిట్​)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసుల దర్యాప్తును నేర విభాగం(క్రైం బ్రాంచ్)​కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాలకు డీసీపీ జాయ్​ టిర్కీ, రాజేష్​ దేవ్​ నేతృత్వం వహిస్తారు. ఒక్కో సిట్​లో నలుగురు అసిస్టెంట్ కమిషనర్ ర్యాంకు అధికారులు ఉంటారు. ఈ మొత్తం దర్యాప్తును అదనపు పోలీసు కమిషనర్ బి.కె.సింగ్ పర్యవేక్షిస్తారు.

ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు 38 మంది మరణించారు. ఈ వ్యవహారంలో 48 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.

ఇదీ చూడండి: 4జీ రాకతో పెరిగిన స్పీడు.. నెలకు 11జీబీ వాడేస్తున్నాం

Last Updated : Mar 2, 2020, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.