ETV Bharat / bharat

'హింసకు పాల్పడిన వారిని విడిచిపెట్టము' - Delhi CP Shrivastava

రైతులు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదన్నారు దిల్లీ పోలీసు కమిషనర్ ​ఎన్​ శ్రీవాస్తవ. పరస్పర ఒప్పందాలకు తూట్లు పొడిచి.. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని అన్నారు. దిల్లీలోని ట్రాక్టర్​ ర్యాలీపై వివరణ ఇచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Delhi Police addresses the media regarding the violence during farmers' tractor rally
రైతులు మాట తప్పారు : దిల్లీ సీపీ
author img

By

Published : Jan 27, 2021, 9:32 PM IST

Updated : Jan 27, 2021, 10:22 PM IST

ట్రాక్టర్​ ర్యాలీలో చెలరేగిన హింసకు రైతు సంఘాల నేతలే బాధ్యత వహించాలని దిల్లీ పోలీసులు వెల్లడించారు. నేతలు విద్వేష ప్రసంగాలు చేశారని, ఘర్షణల్లో పాలుపంచుకున్నారని ఆరోపించారు. వీరి వల్ల 394మందికిపైగా పోలీసు సిబ్బంది గాయపడినట్టు.. నేరానికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలమని తేల్చిచెప్పారు.

ట్రాక్టర్​ ర్యాలీ విధ్వంసం జరిగిన ఒక రోజు అనంతరం మీడియాతో మాట్లాడారు దిల్లీ పోలీస్​ కమిషనర్​ ఎస్​ఎన్​ శ్రీవాస్తవ. రైతులు నిబంధనలను ఉల్లంఘించి ద్రోహం చేశారని మండిపడ్డారు.

"రైతులు నిబంధనలు ఉల్లంఘించి.. నిర్దేశించిన సమయానికి ముందే ట్రాక్టర్​ ర్యాలీ ప్రారంభించారు. ఇతర మార్గాల్లో నగరంలోకి ప్రవేశించారు. బారికేడ్లను తోసుకుని దిల్లీలోకి ప్రవేశించారు. అన్నదాతలను నియంత్రించడానికే బాష్పవాయువు, జలఫిరంగులు ఉపయోగించాం. దీని వల్ల జరిగిన హింసాకాండకు రైతు నాయకులే భాద్యత వహించాలి."

-- ఎన్​ శ్రీవాస్తవ, దిల్లీ పోలీసు కమిషనర్​

ఇప్పటివరకు 25 ఎఫ్​ఐఆర్​లు నమోదుచేసినట్టు.. సీసీటీవీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు శ్రీవాస్తవ.

అయితే పోలీసులు నిగ్రహంతో ఉండటం వల్లే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని పేర్కొన్నారు శ్రీవాస్తవ.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసకు దారితీసింది. నిరసనకారులు నిర్దేశిత మార్గాలు, నిర్ణీత సమయం వంటి నిబంధనలను పక్కనపెట్టి దిల్లీలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు-రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇదీ చూడండి: 'ట్రాక్టర్​ ర్యాలీ'తో రైతు ఉద్యమానికి బీటలు!

Last Updated : Jan 27, 2021, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.