కరోనా వైరస్‌పై పోరులో దేశ రాజధాని దిల్లీ, వాణిజ్య రాజధాని ముంబయి, మరో ఆరు పెద్ద నగరాలే కీలకమని, దేశంలో నమోదైన కొవిడ్-19 కేసుల్లో ఎక్కువ భాగం ఈ నగరాల్లోనే నమోదవడం ఇందుకు కారణమని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు.
దేశంలోని మొత్తం కేసుల్లో ముంబయిలోనే 20 శాతం, దిల్లీలో 11 శాతం ఉన్నాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
''దేశంలో నమోదైన కొవిడ్-19 మొత్తంలో కేసుల్లో ముంబయిలో 20%, దిల్లీలో 11%, అహ్మదాబాద్‌లో సుమారు 9%, పుణెలో సుమారు 4%, చెన్నైలో 4%, ఇండోర్‌లో సుమారు 3%, ఠాణెలో 3 శాతానికి చేరువలో, జైపుర్‌లో సుమారు 2.5% నమోదయ్యాయి. అందువల్ల పోరులో ఈ నగరాలు కీలకంగా మారాయి. పరీక్షలు, కాంటాక్ట్‌ల గుర్తింపు, సమూహ నిఘా అత్యంత కీలకం.''
- అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సీఈఓ
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 52 వేల 952 మందికి వైరస్ సోకింది. మరో 1783 మంది ప్రాణాలు కోల్పోయారు.