ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: పార్టీల 'పేరడీ పోరాటం'- ఓటర్లకు వినోదం

పేరొందిన టెలివిజన్​ ప్రకటనల పేరడీలు ఈ మధ్య రాజకీయాల్లో ఎక్కువయ్యాయి. దిల్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలైన ఆమ్​ ఆద్మీ, భాజపా, కాంగ్రెస్​.. ఈ తరహా స్పూఫ్​లు, మీమ్స్​తో నెట్టింట హల్​చల్​ చేస్తున్నాయి. బాలీవుడ్​ సినిమాలు, ప్రకటనల డైలాగ్​లను స్పూఫ్​లుగా రూపొందించి.. ప్రత్యర్థులపై ఎక్కుపెడుతున్నాయి. జనవరి 8న మొదలైన ఈ ప్రకటనల యుద్ధం ఫలితం తేలేది ఫిబ్రవరి 11నే. అప్పుడే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి.

AAP, BJP & Cong Keep Humour Alive on Social Media
దిల్లీ దంగల్​: పార్టీల 'పేరడీ పోరాటం'- ఓటర్లకు వినోదం
author img

By

Published : Feb 3, 2020, 6:29 PM IST

Updated : Feb 29, 2020, 1:06 AM IST

అంబుజా సిమెంట్​... మన్నికైన, బలమైన సిమెంట్​ అంటూ అప్పట్లో వచ్చిన ప్రకటన ఎంతో ఆదరణ పొందింది. అదే ఇప్పుడు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పేరడీగా మారింది. ఆ ప్రకటనను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి ఆప్​, కాంగ్రెస్​, భాజపా. సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్న కాంగ్రెస్​, భాజపాకు కౌంటర్​గా ఈ సిమెంట్​ ప్రకటన స్పూఫ్ వీడియోను వదిలింది ఆమ్​ ఆద్మీ పార్టీ.

ఆ వీడియోలో ఏముంది?

విడిపోయిన ఇద్దరు సోదరులు.. తమ మధ్య అడ్డుగా ఉన్న గోడను పడగొట్టాలని ప్రయత్నిస్తుంటారు. తమ సమూహంతో వచ్చినా, పెద్ద దుంగతో వచ్చి ఢీకొట్టినా గోడకు చిన్న చిల్లు కూడా పడదు. బాంబులు పెట్టి పేల్చేద్దామని చూసినా ఫలితం శూన్యం. ఎందుకంటే అది అంబుజా సిమెంట్​తో చేసిన గోడ. బలం, నిజాయితీకి మారుపేరు అంటూ ప్రకటన ముగుస్తుంది. ఈ ప్రకటనతో దిల్లీ ఎన్నికలకు సంబంధమేంటనేగా మీ సందేహం. ఉంది మరి!

ఇక్కడ విడిపోయిన సోదరులు ఎవరో కాదు.. కాంగ్రెస్​, భాజపా. మధ్యలో ఉన్న గోడ కేజ్రీవాల్. ఇక ఆ సమూహం ఇరు వర్గాల కార్యకర్తలు. పెద్ద దుంగేమో దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​. బాంబులు.. సీబీఐ దాడులు. ఇలా ఎవరేం చేసినా అధికారం తమదేనని... మధ్యలో అంబుజా సిమెంట్​ అంత బలమైనదిగా ఉన్న గోడ కేజ్రీవాల్​ అంటూ వీడియో ముగుస్తుంది.

స్ఫూఫ్​, మీమ్స్​ వార్​..

ఆ వీడియో స్పూఫ్​​.. భాజపా, కాంగ్రెస్​ను చిర్రెత్తిపోయేలా చేసింది. తామేం తక్కువ కాదంటూ పేరడీలను వదిలాయి. అప్పటినుంచి మొదలైన ఈ స్పూఫ్​​ వార్​ కొనసాగుతూనే ఉంది.

అదే అంబుజా సిమెంట్​ ప్రకటనను కొద్దిగా మార్పులు చేసి దిల్లీ భాజపా వదిలింది. ఇక్కడేమో కేజ్రీవాల్​ స్థానంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ... సోదరులుగా కన్నయ్య కుమార్​, కేజ్రీవాల్ ఉంటారు. మధ్యలో దుంగ, బాంబులుగా జేఎన్​యూ, జామియా అల్లర్లను వీడియోలో ప్రస్తావించింది భాజపా. గోడ ఎందుకు ధ్వంసం కావట్లేదని ఆ సోదరులు అడగ్గా.. అది 130 కోట్ల మంది భారతీయుల ప్రేమతో తయారైంది, ఎలా బద్దలవుతుంది? మోదీ జాతీయ వాదాన్ని ఏం చేయలేరంటూ వీడియో ముగుస్తుంది. ఇక్కడ భాజపా తమ గెలుపుగా పేర్కొంది.

సూపర్​ మారియో టూ సూపర్​ కేజ్రీవాల్​...

ఆమ్​ ఆద్మీ అంబుజా ప్రకటనతో ఊరుకోలేదు. ఈసారి సూపర్​ మారియో వీడియో గేమ్​​తో రంగంలోకి దిగింది. సూపర్​ మారియో స్థానంలో కథానాయకుడిగా సూపర్​​ కేజ్రీవాల్​ను చేర్చి.. ఎన్నో అడ్డంకుల్ని అధిగమిస్తూ దిల్లీని ఆయన అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు వీడియోలో చూపెట్టింది. చివరకు ఈసారీ దిల్లీ పీఠం తమదే అన్నట్లుగా ముగించింది.

మళ్లీ ఆప్​కు చురకలంటిస్తూ దిల్లీ భాజపా.. 'పాప్ కీ అదాలత్​' అంటూ మరో వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ఆప్​.. ​ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని కోర్టులో వాదనలు వినిపించేలా ఈ వీడియోను రూపొందించింది.

భాజపా వీడియోకు దీటుగా బదులిచ్చింది ఆప్​. 'ఇది చాలా బోరింగ్​ కంటెంట్​. ఒక మనిషిని పడగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీకేమైనా సలహాలు కావాలంటే మాతో సన్నిహితంగా ఉండండంటూ' ట్వీట్​ చేసింది.

భాజపా సీఎం అభ్యర్థి ఎవరు..?

భాజపాను దెబ్బకొట్టడానికి ప్రకటనలే కాదు... మీమ్స్​నూ విరివిగా వాడుకుంటోంది ఆమ్ ఆద్మీ. 'సరైన సీఎం అభ్యర్థే లేరంటూ ఆప్​ అడిగిన ప్రశ్నకు.. అది తమను తీవ్రంగా బాధిస్తుందంటూ భాజపా పేర్కొన్నట్లు' సృష్టించిన మీమ్​.. విపరీతంగా ట్రెండైంది. ఇలాగే ఆప్​ రూపొందించిన మరో రెండు, మూడు మీమ్స్​ సామాజిక మాధ్యమాల్లో బాగానే షేరయ్యాయి.

AAP, BJP & Cong Keep Humour Alive on Social Media
అది మమ్మల్ని బాధిస్తోంది: భాజపా

కేజ్రీవాల్​ కాదు.. కేజ్రీ'వెల్'​!

అయితే ఈ స్పూఫ్​ ఫెస్ట్​కు ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. కాంగ్రెస్​ సృష్టించిన వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టింది.
'కేజ్రీవాల్​ కాదు.. కేజ్రీ వెల్​... ఆ బావిలో చీకటి తప్ప మరేమీ ఉండదు.. ఈ సారి ఆ ఉచ్చులో చిక్కుకోవద్దు' అని ప్రజలకు హితబోధ చేస్తూ వీడియో రూపొందించింది కాంగ్రెస్.

  • यह Kejriwal नहीं Kejri-Well है...जिसके झांसों के कुएं में अंधेरे के सिवा कुछ नहीं। झांसे में मत आओ, अपनी अकल लगाओ! @AamAadmiParty pic.twitter.com/JDhhq1jMi4

    — Delhi Congress (@INCDelhi) January 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విజేత కోసం ఆగాల్సిందే..

విజేత కోసం ఆగాల్సిందే..!

ఓటర్లను ఆకర్షించడానికి విభిన్న ప్రయత్నాలు చేస్తున్న ఆయా పార్టీల్లో విజేత ఎవరో తెలియాలంటే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే. అప్పుడే రాజధాని పీఠం ఫలితాలు మరి.

Last Updated : Feb 29, 2020, 1:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.