దిల్లీలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రిని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రారంభించారు. దిల్లీ ఛత్తర్పుర్ రాధా స్వామి సత్సంగ్ బియాస్ ప్రాంతంలో... పది వేల పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు.
20 ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 200 ఎన్‌క్లోజర్స్‌తో ఈ కొవిడ్ కేర్ ఆసుపత్రిని నిర్మించారు. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 పడకలను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలు లేని కరోనా రోగులకు, తక్కువ తీవ్రత ఉన్న బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తారు.
![Delhi LG inaugurates world's 'largest' COVID-19 care centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7899470_itbp.jpg)
![Delhi LG inaugurates world's 'largest' COVID-19 care centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7899470_patel-1.jpg)
![Delhi LG inaugurates world's 'largest' COVID-19 care centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7899470_patel-3.jpg)
నోడల్ ఏజెన్సీగా ఐటీబీపీ
ముఖ్యంగా ఇంటి ఐసోలేషన్ సౌకర్యంలేని కరోనా వ్యాధిగ్రస్తులకు ఈ కేంద్రం చికిత్స అందించనుంది. ఈ ఆసుపత్రికి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
11 రోజుల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం
దిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) 11 రోజుల్లోనే తాత్కాలిక కొవిడ్ ఆసుపత్రిని నిర్మించింది. దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ పేరిట నిర్మించిన ఈ ఆసుపత్రిలో... 250 ఐసీయూ పడకలు సహా మొత్తం వెయ్యి పడకలు ఏర్పాటు చేశారు.
![Delhi LG inaugurates world's 'largest' COVID-19 care centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7899470_drdo-1.jpg)
![Delhi LG inaugurates world's 'largest' COVID-19 care centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7899470_drdo-2.jpg)
![Delhi LG inaugurates world's 'largest' COVID-19 care centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7899470_drdo-3.jpg)
ఈ ఆసుపత్రిలోని వార్డులకు తూర్పు లద్దాఖ్ గల్వాన్ ఘర్షణలో అమరులైన భారత జవాన్ల పేర్లు పెట్టారు. అలాగే ఓ ఐసీయూ వార్డుకు అమరవీరుడు కర్నల్ సంతోష్బాబు పేరు పెట్టారు.
ఇదీ చూడండి: రికార్డ్: ఒక్కరోజులో 24 వేల 850 కేసులు, 613 మరణాలు