దేశ రాజధాని దిల్లీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడుపోతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. ఈనెల చివరి నాటికి 20 డిగ్రీల సెల్సియస్ కన్నా దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే జరిగితే 1901 తర్వాత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన డిసెంబర్ నెలల్లో రెండో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఈ డిసెంబర్ నిలువనుందని పేర్కొంది.
" డిసెంబర్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 1919, 1929, 1961, 1997 సంవత్సరాలలో 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత గత గురువారం వరకు 19.85 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అది డిసెంబర్ 31 నాటికి 19.15 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే.. 1901 తర్వాత రెండో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన డిసెంబర్‌గా నిలువనుంది. 1997, డిసెంబర్లో అత్యంత కనిష్ఠంగా 17.03 డిగ్రీలుగా నమోదైంది."
- భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:వంతెన నిర్మాణ శిక్షణలో ప్రమాదం.. ఇద్దరు జవాన్లు మృతి