వాద్రా పిటిషన్ను విచారించాల్సిన అవసరం లేదని ఈడీ, కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపారు.
రాబర్ట్ వాద్రా, అతని సన్నిహితుడు మనోజ్ అరోడాలు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ వినోద్ గాయల్లతో కూడిన ధర్మాసనం. రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. మే 2కు తీర్పు వాయిదా వేసింది.
లండన్లో సుమారు రూ.17.27 కోట్ల విలువైన ఆస్తులను వాద్రా కొనుగోలు చేశారు. దీంతో వాద్రాపై అక్రమ నగదు బదిలీ కేసు నమోదు చేసింది ఈడీ.