మహిళలు, పురుషులు.. ఇద్దరికీ పెళ్లి చేసుకునేందుకు ఒకే చట్టబద్ధమైన వయసును నిర్ణయించాలని దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలయింది. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ అంశంపై వైఖరి తెలపాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఇది బహిరంగ వివక్ష
ప్రస్తుత చట్టం ప్రకారం మహిళలు 18, పురుషులు 21 వయసు వచ్చేవరకు పెళ్లి చేసుకోవడానికి అనర్హులు. ఇది బహిరంగంగా వివక్ష చూపటమేనని పిటిషన్‌దారు, భాజపా నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మనం నిర్ణయించుకున్న విధానం పితృస్వామ్యం నుంచి వచ్చిందే కానీ అందుకు శాస్త్రీయమైన కారణమేదీ లేకపోవటం విచారకరమని తెలిపారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన'