మద్యం బాటిళ్లపై విధించిన ప్రత్యేక కరోనా ఫీజును 70శాతం ఉపసహరించుకోనుంది దిల్లీ ప్రభుత్వం. ఈ ఉపసంహరణ రేట్లు జూన్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే అన్ని రకాల మద్యం ధరలపై విధించే వ్యాట్‌ను 20 నుంచి 25శాతం వరకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
లాక్డౌన్ కారణంగా ఆదాయ మార్గాలు సన్నగిల్లినందున అదనపు ఆదాయాన్ని ఆర్జించటం కోసం గత నెలలో మద్యం బాటిళ్లపై ప్రత్యేక కరోనా ఫీజును విధించింది దిల్లీ ప్రభుత్వం.
ఇదీ చూడండి:'రాజకీయ చర్చలతోనే ఎల్ఏసీ సమస్య పరిష్కారం'