కరోనా సోకిన వారు ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందేందుకు దిల్లీ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 'జీవన్ సేవ' అనే యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్. వైరస్ సోకి హోం క్వారంటైన్లో ఉన్నవారికోసం ఈ యాప్ ద్వారా ప్రత్యేక సేవలు అందించనున్నట్లు తెలిపారు.
ఉచిత సేవలు...
ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని.. అంబులెన్స్, హెల్త్ చెకప్స్ వంటి సేవలు ఉచితంగా పొందొచ్చని తెలిపారు సత్యేంద్ర జైన్. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లి క్షేమంగా వారిని ఇంటికి చేర్చాక...వాహనాన్ని తప్పకుండా శానిటైజ్ చేస్తారని వివరించారు.
ఇదీ చదవండి:'ఇప్పట్లో భారీ డ్యాంల నిర్మాణం లేనట్టే!'