దిల్లీ విద్యావిధానం చరిత్ర సృష్టించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో... 98 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణులై.. ఈ ఘనత సాధించి పెట్టారని ఆయన పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్.. దిల్లీ బోర్డు పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతం చేశారని ప్రశంసించారు. సీబీఎస్ఈ పరీక్షల్లో 98 శాతం ఉత్తీర్ణత అనేది.. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఉండదని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'పైలట్'ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్