2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణను అడ్డుకున్న కేసులో ఆమ్ఆద్మీ ఎమ్మెల్యే మనోజ్ కుమార్కు 3 నెలల జైలు శిక్ష పడింది. దిల్లీలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసుకునేందుకు రూ.10,000 పూచికత్తుతో ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 131, భారత శిక్షాస్మృతిలోని 186 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, పోలింగ్ కేంద్రాల వద్ద దురుసుగా ప్రవర్తించడాన్ని నేరంగా పరిగణిస్తూ మనోజ్ కుమార్ను దోషిగా తేల్చింది.
ఏం జరిగింది..?
2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంగా ఉన్న ఎమ్సీడీ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద 50 మందితో మనోజ్ కుమార్ నిరసన చేపట్టినట్లు ఆయనపై కేసు నమోదైంది. ఆయన నిరసన వల్ల ఓటర్లు, పోలింగ్ యంత్రాంగానికి సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం