దిల్లీ నిరసనలపై అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో నేడు సీడబ్ల్యూసీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ కానుంది కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి. పౌరసత్వ చట్టంపై తదుపరి అనుసరించాల్సిన వ్యూహలపై సుదీర్ఘంగా చర్చించనుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ నుంచి పలువురు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.
శాంతి కోసం కృషి చేయండి: తివారీ
ఈశాన్య దిల్లీలో అల్లర్ల వేళ.. శాంతిని నెలకొల్పేందుకు పార్టీ నాయకులందరూ కృషి చేయాలని కోరారు దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ. ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగానే దిల్లీ ప్రజలను కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
దిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఆదివారం నుంచి ఇప్పటివరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: భారత్-అమెరికా: 'సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు!'