నవంబర్ 25 నుంచి మూడు రోజులపాటు జరిగే కామన్వెల్త్ యూత్ పార్లమెంట్‌కు మొదటిసారిగా లోక్‌సభ, దిల్లీ శాసనసభ కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ కార్యక్రమంలో 24 కామన్వెల్త్ దేశాల నుంచి 47 మంది ప్రతినిధులు పాల్గొంటారని, వీరిలో భారత్ నుంచి 11 మంది ఉన్నారని.. దిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు.
అవగాహన కల్పించేందుకు..
సోమవారం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా దిల్లీ శాసనసభలో మాక్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో పార్లమెంటరీ అధికారులు, యువనాయకులు, 18 నుంచి 29 ఏళ్ల విద్యార్థినీవిద్యార్థులు పాల్గొంటారు.
శాసన ప్రక్రియలపై యువతకు అవగాహన కల్పించడానికి, చట్టసభల విధానాలు, నిర్ణయాధికారాల్లో యువత పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ యూత్ పార్లమెంట్ ఉద్దేశమని గోయల్ స్పష్టం చేశారు. అలాగే ప్రజాస్వామ్యం, సుపారిపాలనలో చట్టసభల ప్రాధాన్యం, ఉద్దేశ్యం యువతకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర రాజకీయాలు