ETV Bharat / bharat

మోదీతో రాజ్​నాథ్ భేటీ.. సరిహద్దు ఘర్షణపై వివరణ

author img

By

Published : Jun 16, 2020, 4:19 PM IST

Updated : Jun 16, 2020, 5:08 PM IST

భారత్​-చైనా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​. తూర్పు లద్దాక్​ గాల్వన్​ లోయ వద్ద తాజాగా చెలరేగిన ఘర్షణ గురించి.. ప్రధానికి వివరించారు. తక్షణం అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిపారు.

Defense Minister Rajnath Singh met Prime Minister Modi. He explained the growing tensions between China and India over the LOC
మోదీతో రాజ్​నాథ్ భేటీ.. సరిహద్దు ఉద్రిక్తతలపై వివరణ

తూర్పు లద్దాక్​లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించారు. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు.

గాల్వన్​లోయ వద్ద చైనా దుస్సాహసానికి ముగ్గురు భారత సైనికులు మృతి చెందారు. దీనితో భారత్ సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి. రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్.. త్రివిధ దళాధిపతులు, విదేశాంగ మంత్రితో జైశంకర్​తో సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

మరోవైపు భారత సైనికులే సరిహద్దులు దాటారని చైనా ప్రత్యారోపణలు చేస్తోంది. ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో.. తమ వైపూ ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ఐదుగురు చైనా సైనికులు మరణించినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై సీఎంలతో మోదీ సమీక్ష

Last Updated : Jun 16, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.