రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు. అజయ్ కుమార్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేశారు. అయితే.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను హోం క్వారంటైన్లో ఉంచినట్లు వెల్లడించారు.
కార్యాలయం అప్రమత్తం
అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల రక్షణ శాఖ కార్యాలయం అప్రమత్తమైంది. విస్తృతంగా కాంటాక్ట్ ట్రేసింగ్ను నిర్వహించినట్లు తెలిపింది. సౌత్ బ్లాక్‌లోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దాదాపు 35 మంది అధికారులను హోం క్వారంటైన్‌కు తరలించింది. ముందు జాగ్రత్తగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయానికి వెళ్లలేదని అధికారులు తెలిపారు.
అయితే అజయ్ కుమార్ ఆరోగ్యంపై రక్షణ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి: ఆ బౌద్ధ వారసత్వ సంపద ధ్వంసంపై భారత్ ఆందోళన