సరిహద్దులో చైనా, పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.28వేల కోట్లు విలువ చేసే ఆయుధాలను సేకరించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి(డీఏసీ) గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ కార్యాలయం తెలిపింది.
మొత్తం రూ.28 వేల కోట్లలో రూ.27 వేల కోట్ల రక్షణ ఉత్పత్తులను భారత పరిశ్రమల నుంచే సేకరించనున్నట్లు రక్షణ శాఖ కార్యాలయం పేర్కొంది.