ETV Bharat / bharat

భారత్​లో రెండో వ్యాక్సిన్-​ ప్రయోగానికి అనుమతి - co-vaxin

భారత ఫార్మా దిగ్గజం జైడస్ కాడిలా సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్​ మానవులపై ప్రయోగించేందుకు అనుమతించింది డీసీజీఐ. ఇప్పటికే వ్యాక్సిన్​ను జంతువులపై ప్రయోగించి విజయవంతమైంది. దీంతో కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను మానవులపై ప్రయోగిస్తున్న రెండో భారతీయ సంస్థగా గుర్తింపు పొందింది.

DCGI permits human clinical trials for COVID-19 vaccine of Zydus Cadila
భారత్​లో మరో కరోనా​ వ్యాక్సిన్..​ మానవులపై ప్రయోగానికి సిద్ధం!
author img

By

Published : Jul 3, 2020, 11:48 AM IST

Updated : Jul 3, 2020, 12:09 PM IST

మరో స్వదేశీ కొవిడ్​-19 వ్యాక్సిన్ అభివృద్ధికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది​ డ్ర‌గ్ కంట్రోల‌ర్‌ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ). ఫార్మా దిగ్గజ సంస్థ జైడస్​ కాడిలా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్​​ ఇప్పటికే జంతువులపై ప్రయోగించి విజయవంతమైంది. ఇక వ్యాక్సిన్​ మానవులపై ఏమేరకు పనిచేస్తుందో పరీక్షించేందుకు అనుతిచ్చింది డీసీజీఐ.

జంతువులపై ప్రయోగాన్ని క్షుణ్నంగా పరిశీలించాక మానవులపై రెండు దశల్లో ప్రయోగించేందుకు ఇది​ సరైనదిగా ధ్రువీకరించింది డీసీజీఐ. ​

"జైడస్ కాడిలా ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్​ను ఎలుక, కుందేలు, పందులు వంటి జంతువులపై ప్రయోగించింది. ఆ నివేదికను డీసీజీఐకు సమర్పించింది. ఆ ప్రయోగాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశాక.. వ్యాక్సిన్​ ఇచ్చిన కొద్ది గంటలకే జంతువుల శరీరంలో కరోనా వైరస్​ను ఎదుర్కొనే.. యాంటియాక్సిడెంట్లు విడుదల అవుతున్నట్లు తేలింది. జంతువులపై ప్రయోగం విజయవంతమైంది కనుక మానవులపై ప్రయోగానికి జైడస్​ కాడిలాకు అనుమతి దక్కింది."

-డీసీజీఐ అధికారి

ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్​) భాగస్వామ్యంతో భారత్​ బయోటెక్​ ఇంటర్నేషనల్ లిమిటెడ్​ సంస్థ కనిపెట్టిన.. కోవాగ్జిన్ ​ సైతం మానవులపై ప్రయోగించేందుకు అనుమతించింది డీసీజీఐ. దీంతో భారత్​ బయోటెక్​ పుణెలోని జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్​లో ప్రయోగం మొదలుపెట్టింది. కాగా, వ్యాక్సిన్​ క్యాండిడేట్​ను మానవులపై ప్రయోగిస్తున్న రెండో భారతీయ సంస్థగా నిలిచింది జైడస్​ కాడిల్​.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్​!

Last Updated : Jul 3, 2020, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.