ఆంక్షల సడలింపుతో సాధారణ స్థితికి చేరుకుంటున్న కశ్మీర్‌ను పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వీధుల్లో పేరుకుపోయిన చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధికరణ 370 రద్దు నేపథ్యంలో విధించిన ఆంక్షలతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. ఏ ప్రాంతం చూసినా చెత్త దర్శనమిస్తోంది. దుర్వాసన వెదజల్లుతున్న చెత్తతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య పనులను వెంటనే పునరుద్ధరించి చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
" ఇక్కడ చెత్త వేయటం ద్వారా చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో కుక్కలు ఇక్కడికి వస్తున్నాయి. పిల్లలకు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఆస్పత్రి ఉంది. వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చెత్త వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. గతంలో హోటల్ వారు ఇక్కడ చెత్త వేసేవారు. మేము పురపాలికలో ఫిర్యాదు చేశాం. అప్పుడు కొంత మేర తగ్గింది. చుట్టుపక్కల వారు ఇక్కడే చెత్త వేయటం వల్ల పేరుకుపోయింది. రాత్రివేళల్లో వచ్చే మహిళలకు పెద్ద సమస్యగా మారింది. "
- జావిద్, శ్రీనగర్
ఇదీ చూడండి: ఆంక్షలు సడలిస్తున్నా ఎడారిని తలపిస్తున్న కశ్మీర్