ఉన్నావ్ అత్యాచార బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని దిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గురువారం హత్యాయత్నానికి గురైన ఆమెకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
కర్కశం
గతేడాది బాధితురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. కోర్టులో ఆ కేసుపై విచారణ జరుగుతోంది. 10 రోజుల క్రితం ఓ నిందితుడు బెయిల్ వచ్చాడు. మరొకడు పరారీలో ఉన్నాడు.
గురువారం బాధితురాలు న్యాయస్థానానికి వెళ్తున్న సమయంలో ఐదుగురు మానవ మృగాలు ఆమెకు నిప్పు అంటించారు. ఫలితంగా ఆమె శరీరం 90 శాతం వరకు కాలిపోయింది. నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన పోలీసులు.. బాధితురాలిని లఖ్‌నవూ నుంచి దిల్లీ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 'హైదరాబాద్ పోలీసుల నుంచి యూపీ ప్రేరణ పొందాలి'