దేశవ్యాప్తంగా విజయదశమి మహోత్సవాలు ఘనంగా జరుగాయి. ఉత్తర, దక్షిణ భారతం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు జరుపుకున్నారు.
దిల్లీలో జరిగిన రావణ దహనంలో... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొన్నారు. సోనియా గాంధీ స్వయంగా విల్లు ఎక్కుపెట్టి రావణ దహనం కార్యక్రమం ప్రారంభించారు.
మైసూరులో వడయార్ వంశస్థుల పర్యవేక్షణలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఇలా దేశవ్యాప్తంగా భక్తులు రావణదహనం చేస్తూ పండుగ చేసుకున్నారు. చెడుపై మంచి విజయం సాధించడమే ఈ పండుగ విశిష్టత.
ఇదీ చూడండి: భారత్ చెంతకు తొలి 'రఫేల్'.. రాజ్‌నాథ్‌సింగ్ చక్కర్లు