ETV Bharat / bharat

ప్రెసిడెంట్​పై కుల వివక్ష- కింద కూర్చొబెట్టి అవమానం!

సాంకేతికత పరంగా ఎంత ఎదిగినా.. దేశంలో కుల వివక్ష ఇంకా రాచపుండులాగే మిగిలింది. తమిళనాడులో తాజాగా జరిగిన ఓ సంఘటన దేశంలో అణగారిన వర్గాలు, మహిళలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. కులాన్ని కారణంగా చూపి పంచాయతీ సమావేశంలో గ్రామ ప్రెసిడెంట్​ను కింద కూర్చోబెట్టి అవమానించారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం వల్ల ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.

Dalit woman Panchayat president
ప్రెసిడెంట్​పై కుల వివక్ష
author img

By

Published : Oct 10, 2020, 6:36 PM IST

Updated : Oct 10, 2020, 10:03 PM IST

అత్యాధునిక సాంకేతికతలు, అంతరిక్షంపై పట్టు సాధించినా.. దేశంలో కుల వివక్ష జాడ్యం పోవటం లేదు. కులం పేరిట తోటి మనిషిని అవమానించే తీరును మార్చుకోలేకపోతున్నాం. దేశంలో అణగారిన వర్గాలు.. ముఖ్యంగా మహిళలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో తెలిపే ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

Dalit woman Panchayat president
ప్రెసిడెంట్​పై కుల వివక్ష

తమిళనాడులోని ఓ గ్రామ పంచాయతీ‌ సమావేశంలో ప్రెసిడెంట్‌ను కింద కూర్చోబెట్టిన వైనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడలూరు జిల్లా తీర్కుత్తిట్టయిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

అట్రాసిటీ కేసు..

గ్రామ ప్రెసిడెంట్​ రాజేశ్వరి ఫిర్యాదు మేరకు భువనగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీ ఉపాధ్యక్షుడు మోహన్​రాజ్​, కార్యదర్శి సింధుజపై ఎస్​సీ, ఎస్​టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించింది జిల్లా పరిపాలన విభాగం.

జిల్లా కలెక్టర్​ చంద్రశేకర్​, ఎస్​పీ శ్రీ అభినవ్​ గ్రామానికి వచ్చి రాజేశ్వరి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శి సింధుజను విధుల నుంచి తొలగించారు.

Dalit woman Panchayat president
ప్రెసిడెంట్​పై కుల వివక్ష

అసలేం జరిగింది..

రాజేశ్వరి.. ఈ ఏడాది జనవరిలో పంచాయతీ ప్రెసిడెంట్‌గా గెలిచారు. ఆమె దళిత వర్గానికి చెందిన మహిళ. ఈ నేపథ్యంలో పంచాయతీ సమావేశాల్లో మిగతా సభ్యులంతా, కుర్చీలపై ఆసీనులైతే.. రాజేశ్వరిని మాత్రం కిందనే కూర్చొమనేవారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ వివక్షపూరిత చర్యకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌‌ చేశారు. ఈ విషయంపై రాజేశ్వరి కూడా మీడియాతో మాట్లాడారు.

"నా సామాజిక వర్గాన్ని కారణంగా చూపి మోహన్​రాజ్​ నన్ను కింద కూర్చోబెట్టాడు. ప్రెసిడెంట్ కుర్చీలో ఆయనే కూర్చుంటాడు. సమావేశాల్లో అందరికీ కుర్చీలు ఉంటాయి. నాకు తప్ప. అంతేకాదు జెండా ఎగురవేసేందుకు కూడా నన్ను అనుమతించరు. జెండావిష్కరణ కోసం ముందురోజు అన్ని ఏర్పాట్లు మేమే పూర్తి చేశాం. కానీ వాళ్ల నాన్నతోనే ఆ కార్యక్రమం పూర్తి చేయించాడు. ఏం చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోయాం."

- రాజేశ్వరి, తిర్కుత్తిట్టయి ప్రెసిడెంట్

కనిమొళి స్పందన..

ఈ ఘటనపై స్పందించిన డీఎంకే నేత, ఎంపీ కనిమొళి.. రాజేశ్వరిపై వివక్ష చూపడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కులం అనేది మూర్ఖపు అంశమని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కుల వివక్షను నిర్మూలించేందుకే ద్రవిడ ఉద్యమాన్ని పెరియార్ ప్రారంభించారని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: ఆడబిడ్డల పట్ల దుర్విచక్షణ ఏనాటికైనా అంతమయ్యేనా..?

Last Updated : Oct 10, 2020, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.