ETV Bharat / bharat

'కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ' - నాలుగు రోజులుగా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ

దేశంలో కొవిడ్​ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నాలుగు రోజులుగా వైరస్​ బారిన పడ్డవారి కంటే.. జయించిన సంఖ్యే ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. భారత్​లో ఇప్పటి వరకు 55,62,663 మంది వైరస్​ బారిన పడగా.. యాక్టివ్​ కేసులు ఆందులో ఐదో వంతు మాత్రమే ఉన్నాయన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.

Daily recoveries
నాలుగు రోజులుగా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ
author img

By

Published : Sep 22, 2020, 7:13 PM IST

Updated : Sep 22, 2020, 7:27 PM IST

భారత్​లో గత నాలుగు రోజులుగా నమోదైన కరోనా కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. భారత్​లో ఇప్పటివరకు 44,97,867 మంది వైరస్​ను జయించగా.. ఇది ప్రపంచ వాటాలో 19.5శాతం అన్నారు. అమెరికా వాటా 18.6శాతంగా ఉందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దేశం వాటా 17.7శాతం కాగా.. అమెరికా షేరు 22.4శాతం అని పేర్కొన్నారు. దేశంలో మొత్తం కేసులు 55,62,663 ఉండగా.. యాక్టివ్​ కేసులు అందులో ఐదో వంతు మాత్రమే ఉన్నాయన్నారు భూషణ్​.

"దేశంలో 45 లక్షల మంది బాధితులు ఇప్పటికే కోలుకున్నారు. కొవిడ్​ మరణాలు అత్యల్పంగా ఉన్నాయి. భారత్​లో 10లక్షల మందికి 64 మంది చనిపోతుండగా.. ప్రపంచ సగటు 123గా ఉంది."

-రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి

వచ్చే నెల పండుగ సీజన్​ కానుండటం వల్ల ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్​ ధరించాలని సూచించారు కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ సభ్యుడు వీకే పాల్​(నీతి ఆయోగ్ సభ్యుడు). కరోనా నిబంధనలను పాటించకపోతే దేశంలో 80శాతం మంది ప్రజలు మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

"మాస్క్​లు ధరించే విషయంలో అలసత్వం వద్దు. మాస్క్​లు పెట్టుకోవడం వల్ల 36-50శాతం కేసులు తగ్గే అవకాశం ఉంటుంది. పండుగ సీజన్​ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి."

-వీకే పాల్, కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ సభ్యుడు

కొత్త కేసులు ఇలా..

  • ఉత్తర్​ప్రదేశ్​లో 5,722 కొత్త కేసులు రాగా మొత్తం బాధితుల సంఖ్య 3,64,543కి చేరింది. తాజాగా 77 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 5,212కి చేరింది. ప్రస్తుతం 63,148 యాక్టివ్ కేసులున్నాయి.
  • తమిళనాడులో 5,337 కొత్త కేసులు నమోదయ్యాయి. 76 మంది మరణించారు. 5,406 మంది కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,52,674గా, మృతుల సంఖ్య 8,947గా ఉంది.
  • దిల్లీలో మరో 3,816 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. 37 మంది మరణించారు. 3,097 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 2,53,075కు, మరణాల సంఖ్య 5,051కి చేరింది.
  • రాజస్థాన్​లో కొత్తగా 1912 కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. 1528 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18,164 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 1367 మంది మరణించారు.

Last Updated : Sep 22, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.