దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 18,552 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 384 మంది వైరస్‌కు బలయ్యారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.
- మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 1,52,765కు చేరింది. 7,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 79,815 మంది కోలుకున్నారు.
- తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 74,622కు చేరింది. 957 మంది మృతి చెందారు. 41,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- దిల్లీలో కేసుల సంఖ్య 77,240కి చేరింది. మొత్తం 2,492 మంది ప్రాణాలు కోల్పోయారు. 47,091 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 27,657 మంది చికిత్స పొందుతున్నారు.
- గుజరాత్లో వైరస్ కేసుల సంఖ్య 30,095కు చేరింది. ఇప్పటివరకు 1,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,294 మంది చికిత్స పొందుతున్నారు.