దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,851 కొత్త కేసులు, 273 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం.
రాష్ట్రాల వారీగా
కొత్తగా సంభవించిన 273 కరోనా మరణాల్లో... మహారాష్ట్ర- 123, దిల్లీ- 44, గుజరాత్- 33, ఉత్తర్ప్రదేశ్- 16, తమిళనాడు- 12, బంగాల్- 10, తెలంగాణ- 6, మధ్యప్రదేశ్- 6, కర్ణాటక- 4, బిహార్- 4, రాజస్థాన్- 4, ఆంధ్రప్రదేశ్- 3, కేరళ- 3, ఉత్తరాఖండ్- 2, జమ్ము కశ్మీర్- 1, హరియాణా-1, ఝార్ఖండ్-1 చొప్పున నమోదయ్యాయి.
ఇదీ చూడండి: ప్రభుత్వమే కొనుగోలు చేయాలి- రైతుహితమే జాతిభద్రత!