బంగాళాఖాతంలో ఏర్పడిన 'బుల్బుల్' తుపాను బంగాల్‌ను వణికిస్తోంది. తుపాను సంబంధిత ప్రమాదాల్లో ఇప్పటి వరకు దాదాపు 10 మృతి చెందారు. సుమారు 2.73 లక్షల కుటుంబాలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లా, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో వేగంగా వీచిన గాలులకు వందల వృక్షాలు, కేబుల్ వైర్లు తెగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంత జిల్లాలోని 2473 ఇళ్లు ధ్వంసం కాగా, మరో 26 వేల గృహాలు పాక్షికంగా నాశనమైనట్లు విపత్తు నిర్వహాణ సంస్థ తెలిపారు. అంతేకాకుండా 2.73 లక్షల కుటుంబాలు ప్రభావితమయ్యాయని, రాష్ట్రంలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సురక్షిత ప్రదేశాల్లో 1.78 లక్షల మందిని తరలించినట్లు వెల్లడించారు
బంగ్లాదేశ్...
బుల్బుల్ తుపాను ప్రభావం బంగ్లాదేశ్‌పైనా పడింది. తుపాను వల్ల 10 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ముందుగా ముంపు ప్రాంతాల్లోని 21 లక్షల మంది ప్రజలను 5 వేల సురక్షిత కేంద్రాలకు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'5 ఎకరాల భూమి స్వీకరణపై చర్చించాకే నిర్ణయం'