మే 29న ఏఐసీసీ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలు- అధ్యక్ష ఎన్నిక అప్పుడే - Will Congress gets its President soon
A meeting of Congress Working Committee (CWC) will be held on Friday to discuss the political developments and decide the schedule of the party's organisational elections.
12:42 January 22
11:28 January 22
కేంద్రంపై సోనియా విమర్శలు..
సంప్రదింపుల పేరుతో రైతుల విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరించిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో సోనియా గాంధీ ఆరోపించారు. జాతీయ భద్రత విషయంలోనూ పూర్తిగా రాజీ పడుతోందని అన్నారు. అర్నబ్ లీక్స్‌పై ప్రభుత్వం తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
10:30 January 22
రైతుల ఆందోళనకు మద్దతుగా తీర్మానం?
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం మరికాసేపట్లో జరగనుంది. పార్టీకి సంబంధించి అత్యున్నత నిర్ణయాధికారం సీడబ్ల్యూసీ తీసుకుంటుంది.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో పార్టీ అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు. దీనితో పాటు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ప్రకటన వంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
10:19 January 22
సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలు- అధ్యక్ష ఎన్నిక అప్పుడే
- కాసేపట్లో వర్చువల్‌గా సీడబ్ల్యూసీ భేటీ, పార్టీ అధ్యక్ష ఎన్నికే అజెండా
- తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న కాంగ్రెస్ నేతలు
- పార్టీ సంస్థాగత ఎన్నికల తేదీని నిర్ణయించనున్న సీడబ్ల్యూసీ
- బడ్జెట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించనున్న సీడబ్ల్యూసీ
- పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
- రైతుల ఆందోళనకు మద్దతుగా తీర్మానాన్ని ఆమోదించే అవకాశం
- రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని గత సీడబ్ల్యూసీ భేటీలో డిమాండ్
- పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహించేందుకు సిద్ధమన్న రాహుల్