ETV Bharat / bharat

ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం! - రాళ్లను నైవేద్యంగా స్వీకరించే అమ్మవారు

అమ్మవారికి పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు భక్తకోటి. రోజుకో రూపంలో అలంకరించి పూజించుకునే భక్తులు.. నైవేద్యం విషయంలోనూ అంతే జాగ్రత్త వహిస్తారు. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన ప్రసాదం ప్రీతిపాత్రమైనదిగా భావించి, దాన్నే నైవేద్యంగా పెడతారు. అలాగే ఝార్ఖండ్​లోని ఓ అమ్మవారికి రాళ్లను ప్రసాదంగా సమర్పిస్తారు. అదే అక్కడ ఆనవాయితీగా వస్తోందట. అదేంటి రాతిని నైవేద్యంగా పెట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా! అయితే ఈ కథనం చదవాల్సిందే...

Customary to offer stones to the Goddess at the Panchavahini temple at Hajaribagh in Jharkhand
ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం- అదే అక్కడి ఆచారం!
author img

By

Published : Jan 28, 2021, 7:57 AM IST

హజారీబాగ్​లోని పంచవాహిని మందిరం

సమస్యలు తలెత్తినప్పుడు భగవంతుడిని ప్రార్థించి, ప్రశాంతత పొందుతాడు మనిషి. క్రమంగా దేవుడిపై నమ్మకం పెంచుకుంటాడు. వినాయకుడికి ఉండ్రాళ్లు, హనుంతుడికి లడ్డూ ప్రీతిపాత్రమైనవి. శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే ప్రసన్నమవుతాడు. శనిదేవుడికి నువ్వులు ఇష్టమైనవిగా చెప్తారు. ఇందుకు భిన్నంగా ఝార్ఖండ్​ హజారీబాగ్​లో ఉన్న ఓ దేవాలయంలో రాళ్లను సమర్పించడం ఆచారం.

"ఇక్కడ రాళ్లను ప్రసాదంగా పెట్టే ఆచారముంది. కోర్కెలు తీరగానే ఆ రాళ్లు తమతో తీసుకువెళ్తారు భక్తులు."

- వికాస్ కుమార్​ మిశ్రా, పూజారి

"పంచవాహిని మాత ఆశ్రమం ఇక్కడే ఉండేదట. ఈ ప్రాంతం ప్రత్యేకత ఇదే. ఇక్కడ మేం ఓ రాయికి పూజ చేస్తామని వింటే మీకు ఆశ్చర్యం కలగక మానదు."

- మురళీ ప్రసాద్ దాంగీ, స్థానికుడు

ఐదుగురు అమ్మవార్లకు 5 రాళ్లు..

హజారీబాగ్ జిల్లాలోని బడంకాగావ్​లో ఉంది పంచవాహినీ మందిరం. ఈ ఆలయంలో ఐదుగురు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తారు. అందుకే 5రాళ్లు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది.

"ఆలయంలో రాళ్లు సమర్పించేదాకా కష్టాలూ, బాధలు తొలగిపోవని భక్తులు నమ్ముతారు. అందుకే కోరిన కోర్కెలు తీర్చమని వేడుకుంటూ రాళ్లను ప్రసాదంగా పెడతారు."

- శంభుకుమార్ దాంగీ, భక్తుడు

ఇదీ చరిత్ర..

ఈ ఆలయచరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. 1685లో రామ్​గఢ్​ రాజ్యం రాజధానిగా 'బాదం' ఉండేది. బాదమాహీ నది ప్రవహించేది. దాన్నే ఇప్పుడు హరాహరో నదిగా పిలుస్తున్నారు. రాజా హేమంత్​సింగ్​ ఈ నది ఒడ్డునే ఓ కోట నిర్మించుకున్నాడు. నది కారణంగా కోట శిథిలావస్థకు చేరుకోవడం వల్ల రాజా దలేర్​సింగ్​ నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు అడ్డుగా రాళ్లు వేయించాడట. రాజ్యప్రజల సుభిక్షాన్ని కోరుతూ రాజా హేమంత్​సింగ్​ ఐదుగురు అమ్మవార్లకు పూజలు జరిపించాడట. అప్పటినుంచీ రాళ్లను దేవతలకు ప్రసాదంగా పెట్టడం ఆచారంగా వస్తోంది.

"రాజా దలేర్​సింగ్ బాదం సంక్షేమం కోసం చేసిన పని ఆయన సమర్థతకు నిదర్శనం. ప్రవాహ దిశను మార్చి, నదిని సంరక్షించడమే కాదు.. మందిర నిర్మాణం చేపట్టి, కోట శిథిలం కాకుండా కాపాడాడు."

- ప్రమోద్సింగ్, చరిత్రకారుడు

ఆ రాళ్లనే వాడతారట..

నది ప్రవాహాన్ని దారి మళ్లించేందుకు అప్పట్లో వాడిన రాళ్లనే ఆలయంలో ప్రసాదంగా పెడతారు భక్తులు. స్వచ్ఛమైన మనస్సుతో మందిరంలో కోరుకున్న కోరికేదైనా నేరవేరుతుందని నమ్ముతారు.

"ఇక్కడ పూజలు, అర్చనలు చేస్తే కోరుకున్న కోర్కెలు తీరతాయని నమ్మిక. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు."

- బైజ్​నాథ్ కుమార్, భక్తుడు

"చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికొచ్చి, స్నానం చేసి, పూజలు చేస్తారు. ఈ నీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయన్న నమ్మకమూ ఉంది."

- వీరేంద్ర కుమార్, స్థానికుడు

చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పంచవాహిని మందిరం.. ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది. రాళ్లు సమర్పించినంతనే ప్రసన్నం చెందే పంచవాహిని మాతకు.. మరే ఇతర కానుకలు, విరాళాలు ఇవ్వనవసరం లేదని భక్తులు చెప్తున్నారు.

ఇదీ చదవండి: ప్రోగ్రామింగ్​ను ఆటాడుకుంటున్న ఏడేళ్ల బుడతడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.