దుబాయ్ నుంచి జైపుర్‌కు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న స్మగ్లర్ల ముఠాను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
"14 మంది స్మగ్లర్లు దుబాయ్ నుంచి జైపుర్‌కు మూడు విమానాల్లో వచ్చారు. వారందరూ కలిసి సుమారు రూ.16 కోట్లు విలువైన 32 కేజీల బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలించాలని చూశారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నాం. తదుపరి దర్యాప్తు జరుగుతోంది."
- కస్టమ్స్ అధికారులు
వందే భారత్ మిషన్‌లో
కరోనా సంక్షోభ కాలంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయ వలసదారులను తిరిగి స్వదేశానికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టింది. ఇందులో భాగంగా విదేశాల్లోని రాజస్థాన్ వలసదారులను తిరిగి జైపుర్‌కు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టింది. అయితే కొందరు స్మగ్లర్లు ఇదే అదనుగా తమ చేతివాటం ప్రదర్శించారు. దుబాయ్ నుంచి జైపుర్‌కు వచ్చిన విమానంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించి... కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
ఇదీ చూడండి: భారత్ అసాధారణ నిర్ణయంతో టిక్‌టాక్‌కు భారీ దెబ్బ