ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో నక్సల్స్- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. కొందరు మావోయిస్టులు కూడా హతమైనట్లు అనుమానిస్తున్నారు. బీజాపూర్ జిల్లా తంగుదా-పమేద్ ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
మృతి చెందిన జవాన్ సీఆర్‌పీఎఫ్ 151వ బెటాలియన్‌కు చెందినట్లు గుర్తించారు అధికారులు. కమాండోలు, కోబ్రా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు అధికారులు చెప్పారు. ఇరువైపుల నుంచి జరిగిన కాల్పుల్లో జవాన్ మృతి చెందినట్లు తెలిపారు.
దంతెవాడ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లను మట్టుబెట్టారు జవాన్లు.