ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాల్లో మావోయిస్టులు- సీఆర్పీఎఫ్ జావన్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవాను మృతిచెందారు.
మధ్యాహ్నం 2గంటలకు.. జిల్లాలోని ఉరిపాల్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు జరుపుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వ్యక్తిని సీఆర్పీఎఫ్ 170వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ మున్నా కుమార్(32)గా గుర్తించినట్టు వెల్లడించారు.