జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ సీఆర్పీఎఫ్ జవాను మానవత్వాన్ని చాటుకున్నాడు. సైనికులు శత్రువుల గుండెల్లో తూటాలు దింపటమే కాదు.. ఆకలిగా ఉన్నవారిని అక్కున చేర్చుకుంటారని నిరూపించాడు హవల్దార్ ఇక్బాల్ సింగ్.
చిన్నారి ఆకలి కన్నీరు చూసి...
శ్రీనగర్‌లో సోమవారం విధులు నిర్వర్తిస్తుండగా ఆకలితో ఉన్న ఓ చిన్నారిని చూశాడు ఇక్బాల్. వెంటనే తన భోజనాన్ని బాలుడికి ఇవ్వడానికి ప్రయత్నించాడు. పక్షవాత బాధితుడైన చిన్నారి సొంతంగా తినలేని పరిస్థితిని గ్రహించిన ఇక్బాల్... క్షణం ఆలస్యం చేయకుండా స్వయంగా భోజనం తినిపించాడు. మంచినీరు అందించి... చిన్నారి ఆకలిని తీర్చాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జవాను చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
-
#WATCH CRPF Havaldar Iqbal Singh deployed in Srinagar feeds his lunch to a paralytic child. He has been awarded with DG's Disc & Commendation Certificate for his act; He was driving a vehicle in the CRPF convoy on Feb 14 at the time of Pulwama terrorist attack. (13th May) pic.twitter.com/WH0sPlB9Vr
— ANI (@ANI) May 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH CRPF Havaldar Iqbal Singh deployed in Srinagar feeds his lunch to a paralytic child. He has been awarded with DG's Disc & Commendation Certificate for his act; He was driving a vehicle in the CRPF convoy on Feb 14 at the time of Pulwama terrorist attack. (13th May) pic.twitter.com/WH0sPlB9Vr
— ANI (@ANI) May 14, 2019#WATCH CRPF Havaldar Iqbal Singh deployed in Srinagar feeds his lunch to a paralytic child. He has been awarded with DG's Disc & Commendation Certificate for his act; He was driving a vehicle in the CRPF convoy on Feb 14 at the time of Pulwama terrorist attack. (13th May) pic.twitter.com/WH0sPlB9Vr
— ANI (@ANI) May 14, 2019
మానవత్వం చాటిన ఇక్బాల్‌ను పారామిలిటరీ దళాల అత్యున్నత అవార్డు 'డైరెక్టర్ జనరల్ కమెండేషన్ డిస్క్' వరించింది.
ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో వాహణశ్రేణిలోని ఓ వాహనాన్ని నడిపాడు ఇక్బాల్.
ఇదీ చూడండి: కోల్‌కతాలో అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లదాడి