ETV Bharat / bharat

బంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌-సీపీఎం జట్టు

ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న బంగాల్​లో తిరిగి జెండా పాతే దిశగా అడుగులేస్తోంది సీపీఎం. వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్​తో కలిసి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.

CPM and Congress joining hands for 2021West Bengal assembly polls
బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఎం జట్టు
author img

By

Published : Nov 1, 2020, 5:30 AM IST

వచ్చే ఏడాది జరగబోయే బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేయనుంది సీపీఎం. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. శుక్ర, శనివారాల్లో వర్చువల్‌గా నిర్వహించిన సమావేశాల అనంతరం పార్టీ నిర్ణయాలను వెల్లడించారు.

కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమిగానే బరిలోకి దిగనున్నట్లు సీపీఎం స్పష్టం చేసింది. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమితో కలిసి పనిచేయనుంది. అసోంలోనూ కాంగ్రెస్‌ సహా ఇతర లౌకిక పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది సీపీఎం. అక్కడ అధికార భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ఇతర పార్టీలతో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొంది.

పశ్చిమ బంగాలో మూడు దశాబ్దాల పాటు ఏలిన సీపీఎం.. అధికార తృణమూల్‌ను, భాజపాను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ సహా ఇతర లౌకిక పార్టీలతో ఎన్నికల అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. 294 స్థానాలకుగాను ఆ పార్టీకి 2016లో కేవలం 26 స్థానాలు మాత్రమే వచ్చాయి.

కార్మికుల్ని బానిసలుగా మార్చే కుట్ర!

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏచూరి దుమ్మెత్తిపోశారు. కరోనాను నియంత్రించడంలో తన బాధ్యతను మోదీ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. దేశంలో ప్రజలు నిరుద్యోగం, అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల ఖాతాల్లో నగదు జమ చేయాలన్న సీపీఎం డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం కార్మికుల హక్కులను హరించడమేనన్నారు. దీన్ని బానిసలుగా మార్చే కుట్రగా అభివర్ణించారు. విదేశీ, దేశీయ కార్పొరేట్లకు దోచిపెట్టేవిగా వ్యవసాయ చట్టాలు ఉన్నాయన్నారు ఏచూరి. వ్యవసాయ, కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కార్మిక సంఘాలతో కలిసి నవంబర్‌ 26న జాతీయ స్థాయిలో సమ్మెకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: నితీశ్ అవినీతిని మోదీనే బయటపెట్టారు: తేజస్వీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.