కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జన సమూహం అధికంగా ఉండే సంస్థలు మూతపడుతున్నాయి. శ్రీనగర్‌లోని అన్ని విద్యా సంస్థలు, స్టేడియంలు, స్పోర్ట్స్ క్లబ్‌లను గురువారం నుంచి మూసివేస్తున్నట్లు నగర పాలక మండలి ప్రకటించింది.
"అన్ని విద్యా సంస్థలు, పబ్లిక్ క్లబ్స్, స్పోర్ట్స్ క్లబ్స్, ఇండోర్, ఓపెన్ స్టేడియంలు, కోచింగ్ సంస్థలను తదుపరి ఆదేశాల వరకు మూసివేయాలని ఎస్ఎమ్సీ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది."
-- జునైద్ అజీమ్, శ్రీనగర్ మేయర్
ప్రస్తుతం ఉన్న అన్ని క్రీడా కార్యక్రమాలను, వారాంతాల్లో నిర్వహించే సంతలను రద్దు చేశారు అధికారులు. రోడ్లపై నిర్వహించే దుకాణాల్లో ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయకూడదని ప్రజలకు సూచిస్తున్నారు.
లద్దాఖ్‌లో కళాశాలలకు సెలవులు
లద్దాఖ్‌లోనూ ఈనెల 31వ తేదీ వరకు అన్ని కళాశాలలు, విశ్వ విద్యాలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతవారం నుంచే ఇక్కడి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఇదీ చదవండి: 1500 ఉత్తరాలతో పెద్దాయన 'పెండ్లి పిలుపు'