ETV Bharat / bharat

'కరోనా సాకుతో కార్మికులకు అన్యాయమా?' - Supreme Court on Gujarat notification

కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక మందగమన భారాన్ని కార్మికులపైనే వేయడం సరికాదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. పరిశ్రమల్లో ఎక్కువ గంటలు పని చేసే కార్మికులకు అదనపు వేతనాలు చెల్లించకుండా మినహాయింపు ఇచ్చే గుజరాత్​ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Covid-led economic slowdown no ground to deny proper wages to workers: SC
'వారికి వేతనాలు చెల్లించకపోవడానికి కరోనా సాకు కాదు'
author img

By

Published : Oct 1, 2020, 5:58 PM IST

కొవిడ్ సాకుతో కార్మికుల వేతనాలు చెల్లించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఆర్థిక కార్యకలాపాలకు వెన్నెముఖ అయిన కార్మికులపైనే ఆర్థిక మందగమన భారాన్ని మోపడం చట్ట విరుద్ధమని పేర్కొంది. వైరస్​ను కారణంగా చూపి వేతనాలు చెల్లించకపోవడం కార్మికుల చట్టబద్ధమైన హక్కులను హరించడమేనని పేర్కొంది. గుజరాత్​ ప్రభుత్వ నోటిఫికేషన్​కు సంబంధించిన​ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

ఏంటి గుజరాత్​ నోటిఫికేషన్​?

2020, ఏప్రిల్​ 20 నుంచి జులై 19 వరకు పరిశ్రమల్లో సిబ్బంది ఎక్కువ గంటలు పని చేసినా అదనపు వేతనం చెల్లించకుండా మినహాయింపునిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది గుజరాత్​ రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనిని సవాలు చేస్తూ గుజరాత్​ మజూందార్​ సభ పిటిషన్​ వేసింది. విచారణ జరిపిన జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం నోటిఫికేషన్​ చెల్లదని తీర్పు వెలువరించింది.

ఇదీ చూడండి: హాథ్రస్​ పర్యటనలో హైడ్రామా- రాహుల్ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.