కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇటీవల చెన్నైలోని ఓ హోటల్ యాజమాన్యం వినూత్నంగా పరోటా మాస్కులు తయారు చేసింది. ఇదే పంథాలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న ఆలోచనతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. కొత్తగా 'కరోనా కర్రీ'తో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
దేశవ్యాప్తంగా అందరినోటా నానుతున్న కరోనా వైరస్ పేరుతో రకరకాల వంటలను వేదిక్ రెస్టారెంట్ తయారు చేస్తోంది. వంటశాలలో చేసే కర్రీలను వైరస్ ఆకారంలో అలంకరించి ఆహార ప్రియులను ఆకట్టుకునేలా... ఘుమఘుమ రుచులు అందిస్తోంది. అక్కడ తయారు చేసే వంటకాలైన 'మలై కోప్తా' కర్రీని కొవిడ్-19గా, రోటిని మాస్క్ ఆకారంలో వండివార్చుతున్నారు. ఈ రెస్టారెంట్‌లో తయారైన మాస్క్నాన్, కొవిడ్ కర్రీని తాము ఎంతో ఇష్టంగా తింటున్నట్లు ఆహార ప్రియులు చెబుతున్నారు.
'కొత్తగా ప్రయత్నిస్తేనే ప్రజలను ఆకర్షించగలం. అందుకే మేము మెనూలో కరోనాను చేర్చాం. ఈ విధంగానైనా వైరస్‌పై అవగాహన పెరుగుతుంది' అని రెస్టారెంట్ యజమాని అనిల్ కుమార్ చెప్పారు. భవిష్యత్‌లో మెనూ కార్డులను తాకకుండా ఉండేందుకు డిజిటల్ మెనూ ఏర్పాటుతో పాటు భౌతిక దూరం పాటించేలా చేస్తామని అనిల్ తెలిపారు.
ఇదీ చూడండి: భారత్‌లో 2 కోట్లు దాటిన కరోనా పరీక్షలు