ETV Bharat / bharat

టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు...

శాస్త్రవేత్తల కష్టం ఫలించింది. కరోనాకు వ్యాక్సిన్​ సిద్ధమైంది. అయితే.. ఈ టీకాపై ప్రజల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరెన్నో వదంతులు వ్యాపిస్తున్నాయి. వాటికి నిపుణులు చెబుతున్న సమాధానాలే ఈ కథనం.

COVID-19 vaccines: Myths and facts
వ్యాక్సిన్​ రాబోతుంది.. మరి అపోహలు తీరేదెలా?
author img

By

Published : Dec 28, 2020, 2:08 PM IST

వివిధ దేశాల్లో అత్యవసర వినియోగం కోసం వినియోగించేందుకు.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి​ వచ్చింది. మన దేశంలోనూ త్వరలోనే వచ్చే సూచనల కనపడుతున్నాయి. కానీ, ప్రజల్లో టీకా సమర్థతపై ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఇవి చాలదన్నట్టు.. వ్యాక్సిన్​ వేయించుకుంటే వివిధ కొత్త సమస్యలు ఎదురువుతాయని వదంతులు వ్యాపిస్తున్నాయి. అందుకే.. టీకాలు సురక్షితమని చాటేందుకు వివిధ దేశాల్లో అధ్యక్షులు, ప్రముఖులు, రాజకీయ నేతల వంటి వారు మొదటగా వ్యాక్సినేషన్​ చేయించుకుంటున్నారు.

ఇంతకీ వ్యాక్సిన్​ పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏంటి? వాటిలో నిజమెంత?

అపోహ: వ్యాక్సిన్​ను హడావుడిగా తెచ్చారు. అందుకే అది సురక్షితమైంది కాదు.

వాస్తవం: చాలా కొవిడ్​ వ్యాక్సిన్లు వేగంగా అభివృద్ధి చేశారనేది నిజమే. కానీ, ఆ వ్యాక్సిన్లు ఏ విధమైన భద్రతా ప్రమాణాలు పాటించకుండానే తీసుకువస్తున్నారనేది అవాస్తవం. టీకా ఉత్పత్తిదారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. అభివృద్ధి ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆ టీకాలు సురక్షితమైనవి, సమర్థమైనవని నిరూపించుకునేందుకు విస్తృతంగా క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాలి. అప్పుడే అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తుంది.

అపోహ: వ్యాక్సిన్​ తీసుకుంటే కొవిడ్​ సోకుతుంది.

వాస్తవం: అన్ని వ్యాక్సిన్లలాగే కొవిడ్​ వ్యాక్సిన్​ కూడా.. వ్యాధిని అనుకరించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దానివల్ల అస్వస్థత లక్షణాలు కనిపించినా.. అవి నిజమైనవి కావు. సార్స్​ కొవ్​-2 వైరస్​ను గుర్తించడానికి రోగనిరోధక వ్యవస్థకు కొవిడ్​ టీకా శిక్షణ ఇస్తుంది. అయితే.. టీకా తీసుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి పొందడానికి కాస్త సమయం పడుతుందనేది అందరూ గుర్తుంచుకోవాలి.

అపోహ: ఎమ్​ఆర్​ఎన్​ఏ టీకాలు మన డీఎన్​ఏ నిర్మాణాన్ని మార్చేస్తాయి.

వాస్తవం: ఎమ్​ఆర్​ఎన్​ఏ సాంకేతికతో తయారైన టీకాలు.. వైరస్​ జన్యుపదార్థాన్ని ఉపయోగించుకుని సార్స్​ కొవ్​-2 వైరస్​ ఉపరితలంపై ఉండే ప్రొటీన్​ను మన శరీరం ఉత్పత్తి చేసేలా చేస్తాయి. ఫలితంగా.. ఆ ప్రొటీన్​లను రోగ నిరోధక వ్యవస్థ గుర్తించి యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తుంది. అయితే.. ఎమ్​ఆర్​ఎన్​ఏ కు, డీఎన్​ఏకు సంబంధమూ లేదు. ఈ ఎమ్​ఆర్​ఎన్​ఏ మానవ డీఎన్ఏతో ఎప్పుడూ కలవబోదని, జన్యక్రమాన్ని మార్చలేదని పరిశోధకులు తమ అధ్యయనాలతో స్పష్టం చేశారు.

COVID-19 vaccines: Myths and facts
వ్యాక్సిన్​ రాబోతుంది.. మరి అపోహలు తీరేదెలా?

అపోహ: టీకా తీసుకుంటే తీవ్ర ప్రతికూలతలు ఎదురవుతాయి.

వాస్తవం: వ్యాక్సినేషన్​ తర్వాత స్వల్పంగా తలనొప్పి, కండరాల నొప్పులు లేదా జ్వరం లాంటివి వస్తాయి. అయితే.. టీకా తీసుకున్న తర్వాత ఇలాంటి ప్రతికూలతలు ఎదురవడం అత్యంత సహజం. అలాంటివి ఒకటి, రెండు రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. ఆరోగ్యవంతుల్లో కొవిడ్​ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఏర్పడవు అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. బ్రిటన్​లో టీకా తీసుకున్న కొద్దిమంది అలెర్జీకి గురయ్యారు. దీనిపై అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టారు.

అపోహ: టీకా తీసుకుంటే వంధ్యత్వానికి దారి తీస్తుంది.

వాస్తవం: కొన్ని సంస్థలు అభివృద్ధి చేసిన టీకా తీసుకుంటే.. మహిళల్లో సంతానలేమికి దారి తీస్తుందన్న వదంతులు వినిపిస్తున్నాయి. అయితే అది పూర్తిగా అవాస్తవం. ఇంతవరకు టీకా వల్ల మహిళల్లోగానీ, పురుషుల్లోగాని వంధ్యత్వం కలుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

అపోహ: టీకాతో మన శరీరంలోకి చిప్​ అమర్చుతారు.

వాస్తవం: ప్రజలపై నిఘా పెట్టేందుకు టీకా ద్వారా శరీరాల్లోకి మైక్రోచిప్​ను చేర్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్న వదంతులు వినిపిస్తున్నాయి. అయితే.. టీకాలో చిప్​ను అమర్చేంతటి సాంకేతికత ఇప్పటివరకు అందుబాటులో లేదు. ప్రజల్లో ఉన్న ఇలాంటి అనుమానాలను నివృతి చేయాలన్న ఉద్దేశంతో ఓ దిగ్గజ ఫార్మా సంస్థ.. తమ టీకా తయారీకి వినియోగించిన ఇన్​గ్రీడియంట్స్​ జాబితాను ఇటీవల విడుదల చేసింది.

అపోహ: సహజంగా వచ్చే రోగనిరోధక శక్తి మాత్రమే ఉత్తమం. టీకాతో పెద్దగా ప్రయోజనం లేదు.

వాస్తవం: ఏ రకమైన వ్యాధి సోకినా సహజంగా ఏర్పడే రోగనిరోధక శక్తి ఉత్తమమైంది. కానీ, కొవిడ్​ విషయంలో మాత్రం అది సాధ్యం కాకపోవచ్చు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వారిలో రెండోసారి వ్యాధి సోకిన సంఘటనలు వెలుగు చూశాయి. వ్యాక్సిన్ ద్వారా​ మాత్రమే దీర్ఘకాలం పాటు రోగనిరోధక శక్తి ఉంటుంది.

అపోహ: నా చుట్టూ ఉన్నవారు టీకా తీసుకుంటే.. నాకు ఇక టీకా అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు హెర్డ్​ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది.

వాస్తవం: హెర్డ్​ ఇమ్యూనిటి సాధించడం ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. దానికి ఇంకా 18 నెలల సమయం పట్టవచ్చు. నిత్యం వేల మంది కొవిడ్​ వల్ల మరణిస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే వరకు ఎదురుచూస్తే మనమూ బాధితులుగా మారక తప్పదు!

అపోహ: తీవ్రంగా అలర్జీలు ఉన్నవారు వ్యాక్సిన్​ వేయించుకోరాదు.

వాస్తవం: అన్ని రకాల వ్యాక్సిన్లు ఏదో రకమైన అలర్జీకి దారి తీస్తాయి. అంతకుముందే అలెర్జీలు ఉన్నవారు టీకా వేయించుకోవాలా వద్దా అని తమ ఫిజీషియన్​ను​ సంప్రదిస్తే సరిపోతుంది.

ఇదీ చూడండి:దేశంలో కొత్తగా 20,021 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.