కరోనా వ్యాక్సిన్ 'కొవిషీల్డ్'ను 'భాజపా టీకా'గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. టీకా వేయించుకోవడం వల్ల ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీకాలకు రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు.
-
The more people that get vaccinated the better it will be for the country & the economy. No vaccine belongs to any political party, they belong to humanity & the sooner we get vulnerable people vaccinated the better.
— Omar Abdullah (@OmarAbdullah) January 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The more people that get vaccinated the better it will be for the country & the economy. No vaccine belongs to any political party, they belong to humanity & the sooner we get vulnerable people vaccinated the better.
— Omar Abdullah (@OmarAbdullah) January 2, 2021The more people that get vaccinated the better it will be for the country & the economy. No vaccine belongs to any political party, they belong to humanity & the sooner we get vulnerable people vaccinated the better.
— Omar Abdullah (@OmarAbdullah) January 2, 2021
దేశంలో టీకా అనేది ఏ రాజకీయ పార్టీకీ చెందినది కాదు. ఇది కేవలం మానవత్వానికి సంబంధించిన అంశం. కరోనా మహమ్మారికి టీకా వస్తుందంటే ఇతరులు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. నా వరకు మాత్రం చాలా ఆనందిస్తా. టీకా వేయించుకొనేందకు ముందు వరుసలో ఉంటా.
-ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
'భాజపా టీకా' వేయించుకోనని లఖ్నవూ విలేకరుల సమావేశంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది.
ఇదీ చదవండి: 'భాజపా వ్యాక్సిన్ను తీసుకునే ప్రసక్తే లేదు'