ETV Bharat / bharat

దేశంలో 16.5 కోట్ల కరోనా టెస్టులు - coronavirus tests

భారత్​లో ఇప్పటివరకు మొత్తం 16.5 కోట్ల కొవిడ్​ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజూ సగటున 10 లక్షల కంటే ఎక్కువ టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫలితంగా సానుకూలత రేటు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

COVID-19: Total tests in India nearing 16.5 crore
దేశంలో 16.5 కోట్ల మందికి కరోనా టెస్టులు
author img

By

Published : Dec 23, 2020, 5:49 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా రోజూ సగటున 10 లక్షల కొవిడ్​ పరీక్షలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం వైరస్​ టెస్టుల సంఖ్య 16.5 కోట్లకు చేరిందని వెల్లడించింది.

దేశంలోని మొత్తం వైరస్ కేసుల్లో.. క్రియాశీలక కేసుల కేవలం 2.86 శాతమే ఉన్నాయన్న మంత్రిత్వ శాఖ.. 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్​ కేసులు సంఖ్య 10 వేల దిగువ ఉన్నట్లు తెలిపింది.

మంత్రిత్వ శాఖ తెలిపిన ముఖ్యాంశాలు

  • భారత్​లో ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 1,19,035 మందికి కొవిడ్ టెస్టులు చేస్తున్నాం. ఈ సంఖ్య 23 రాష్ట్రాల్లో దేశీయ సగటు కంటే ఎక్కువగా ఉంటుంది.
  • కొవిడ్​ సానుకూలత రేటు దేశీయ సగటు కంటే 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తక్కువగా ఉంది.
  • రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల కంటే రికవరీల అధికంగా ఉండటం వల్ల యాక్టివ్​ కేసుల సంఖ్య తగ్గి 2,89,240 చేరింది.
  • రోజూ 10,98,164 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. దేశంలో రోజువారీ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం 15 లక్షలు చేరింది.
  • పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో టెస్టింగ్​ సదుపాయాలు పెంచడం వల్ల ఆ ప్రాంతాల్లోనూ సానుకూలత రేటు తగ్గుతోంది.
  • కొవిడ్​ నుంచి కోలుకున్నవారి సంఖ్య 9,663,382కు పెరిగింది.
  • పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 75.87శాతం మంది రికవరీ అవుతున్నారు. కేరళ, మహారాష్ట్ర, బంగాల్​ రాష్ట్రాలు కరోనా రికవరీల్లో ముందు వరుసలో ఉన్నాయి.
  • రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో 77.34శాతం పది రాష్ట్రాల్లో నుంచి వచ్చినవే. అందులో కేరళ అగ్రస్థానంలో ఉండగా.. మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఉంది.
  • తాజా కరోనా మరణాలు ఎక్కువ 10 రాష్ట్రాల్లో నమోదైనవే. అత్యధికంగా మహారాష్ట్రలో సంభవించగా.. బంగాల్​, కేరళ తర్వాతి వరుసలో ఉన్నాయి.

ఇదీ చూడండి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.