ETV Bharat / bharat

మృతదేహాల్లో కరోనా ఎంతకాలం బతుకుతుందో చెప్పలేం! - కొవిడ్ మరణాలు జాగ్రత్తలు

కరోనా సోకిన మృతదేహాల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు సహా పలు అనుమానాలపై భారత వైద్య పరిశోధన మండలి స్పష్టతనిచ్చింది. శవపరీక్షల మార్గదర్శకాలకు సంబంధించి తరచుగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల్లో నెగెటివ్​గా తేలిన మృతదేహాలను కూడా కరోనా కేసుగానే పరిగణించాలని పేర్కొంది.

corona dead body
కరోనా మృతదేహం
author img

By

Published : May 20, 2020, 3:32 PM IST

కరోనా సోకిన మృతదేహాల్లో సమయానుగుణంగా వైరస్ మనుగడ కోల్పోతుందని భారత వైద్య పరిశోధన మండలి స్పష్టం చేసింది. అయితే నిర్దిష్ట గడువులోగా మృతదేహంలో ఉన్న వైరస్ నశిస్తుందని స్పష్టంగా చెప్పలేమని పేర్కొంది. అందువల్ల శవపరీక్షలు నిర్వహించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

భారత్​లో కొవిడ్ మృతదేహాల శవపరీక్షల మార్గదర్శకాలకు సంబంధించి తరచుగా అడిగిన ప్రశ్న(ఎఫ్​ఏక్యూ)లకు ఈమేరకు సమాధానాలు ఇచ్చింది ఐసీఎంఆర్. కొవిడ్-19 సాధారణంగా తుంపర్ల ద్వారానే సోకుతుందని స్పష్టం చేసింది.

నెగెటివ్​ అయినా సరే!

ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల్లో అధికంగా సంఖ్యలో తప్పుడు నెగెటివ్ ఫలితాలు ఉన్న నేపథ్యంలో... ఆ​ పరీక్ష ఫలితాల్లో నెగెటివ్​గా తేలిన మృతదేహాలను కూడా కరోనా సోకిన కేసుగానే పరిగణించాలని వెల్లడించింది ఐసీఎంఆర్. శరీరాన్ని చీల్చి నిర్వహించే శవపరీక్ష పద్ధతులు పాటించకూడదని సూచించింది.

నాసికా కుహరంలోని శ్లేష్మం, ద్రవాలు సహా మృతదేహం నుంచి వెలువడే వాయువుల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. అందువల్ల మృతదేహాల శరీరాలపై క్రిమి సంహారకాలను వాడటం ద్వారా వైరస్ నుంచి ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేసింది.

ఒకే గదిలో ఉంచితే?

కొవిడ్ మృతదేహాలు, సాధారణ మృతదేహాలను ఒకే కోల్డ్ ఛాంబర్​లోని వేర్వేరు ర్యాక్​లలో ఉంచితే మృతదేహాలను నిర్వహించే సిబ్బందికి కరోనా సోకే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ఐసీఎంఆర్. శరీరాన్ని డబుల్ బ్యాగేజీలో భద్రపరిచి, సరైన పీపీఈలు వినియోగిస్తే వైరస్ వ్యాపించే ప్రమాదం తక్కువే అని తెలిపింది.

అలాంటి శవాలను మార్చరీకి తరలించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించింది. సిబ్బంది కొరత ఉంటే ఎన్​జీఓలకు చెందిన వలంటీర్లను ఉపయోగించుకోవాలని పేర్కొంది.

అంతర్గత విచ్ఛేదనం వద్దు

అసహజ కారణాల వల్ల కొవిడ్ నిర్ధరిత లేదా అనుమానిత రోగి మరణిస్తే.. పోలీసుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలని సూచించింది. అంతర్గత విచ్ఛేదనం చేయకుండానే శవాన్ని రోగి కుటుంబసభ్యులకు అందజేయాలని వెల్లడించింది. మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ల్యాబ్ రిపోర్టులు, డయాగ్నోస్టిక్ పరీక్ష ఫలితాలు, ఆస్పత్రుల రికార్డులు దర్యాప్తు కోసం ఉపయోగపడతాయని పేర్కొంది.

ఇవీ చదవండి: కరోనా టెస్టుల కోసం 'చిత్ర మాగ్నా' కిట్​కు అనుమతి

టీబీ డయాగ్నోస్టిక్ యంత్రాలతో కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.