ETV Bharat / bharat

అకడమిక్ క్యాలెండర్​లో మార్పుల దిశగా రాష్ట్రాల యోచన! - పాఠశాలలకు వేసవి సెలవులు

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా చూసేందుకు ఆయా రాష్ట్రాలు వివిధ ప్రణాళికలు వేస్తున్నాయి. వేసవి సెలవులను కాస్త ముందుకు జరపాలని నిర్ణయించాయి. అలాగే సరికొత్త అకడమిక్ క్యాలెండర్ రూపొందించే పనిలో ఉన్నాయి.

States working on academic calendar, deliberating on advancing summer break in schools
అకాడమిక్ క్యాలెండర్​లో మార్పుల దిశగా రాష్ట్రాల యోచన!
author img

By

Published : Apr 23, 2020, 9:04 AM IST

కరోనా సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పంజాబ్​, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికే విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించాయి. వీటిని అనుసరిస్తూ ఇతర రాష్ట్రాలు కూడా సెలవులను కాస్త ముందుగానే ప్రకటించే ఆలోచనలో ఉన్నాయి. అలాగే విద్యా సంవత్సరం నష్టపోని రీతిలో అకడమిక్ క్యాలెండర్ రూపొందించడం సహా పలు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నాయి.

రాష్ట్రాలకు ఆ హక్కు ఉంది..

"విద్య అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. రాష్ట్రాలకు... తమ సొంత అకడమిక్ క్యాలెండర్ రూపొందించుకునే, వేసవి సెలవుల షెడ్యూల్ మార్చుకునే స్వేచ్ఛ ఉంది. తమ ప్రాంతంలోని కరోనా వ్యాప్తి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఆయా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది."

- మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి

సెలవులు ముందుకు వచ్చాయ్​..

పంజాబ్​లో సాధారణంగా వేసవి సెలవులు మే నెల చివరి నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈసారి కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ముందుగానే అంటే ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం అయితే మార్చిలోనే వేసవి సెలవులు ప్రకటించేసింది.

సెలవుల్లో తరగతులు...

లాక్​డౌన్​ కారణంగా విద్యాసంవత్సరం నష్టపోకుండా వేసవిలో తరగతులు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని దిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా మేధావులను, విద్యార్థుల తల్లిదండ్రులను కోరింది.

జూన్​ 1 తరువాత ఆలోచిద్దాం...

ఆన్​లైన్ వేదిక లోకల్​సర్కిల్స్.కామ్.... 10 వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులను సర్వే చేసింది. వీరిలో సుమారు 81 శాతం మంది మే నెలలో పాఠశాలలు మూసివేసి, జూన్​ 1 తరువాత తెరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఫీజులు, జీతాలు

లాక్​డౌన్​ సమయంలో విద్యార్థుల పాఠశాల ఫీజులు, ఉపాధ్యాయుల జీతాల సమస్యను... ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సున్నితంగా పరిష్కరించాలని సీబీఎస్​ఈ లేఖ రాసింది. అదే సమయంలో విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

ఫిర్యాదు చేయవచ్చు..

లాక్​డౌన్​ కాలంలో విద్యాసంస్థలు ఫీజులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదని, ట్యూషన్ ఫీజు మాత్రం వసూలు చేసుకోవచ్చని దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, బంగాల్ ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి.

ఫీజులు కట్టమని విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తే, తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 100 కి.మీ. కాలినడక- 12 ఏళ్ల బాలిక మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.