దేశంపై కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. రికార్డు స్థాయిలో కొత్తగా 90,802 కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి ధాటికి మరో 1,016 మంది బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 71వేల 642కు చేరింది. మరోవైపు కేసుల విషయంలో బ్రెజిల్ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకింది భారత్. అయితే.. 64 లక్షలకుపైగా కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 7,20,362 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం టెస్ట్ల సంఖ్య 4 కోట్ల 95 లక్షలు దాటింది.
రికవరీలో మరింత పెరుగుదల
పెరుగుతున్న కేసులకు అనుగుణంగా.. బాధితులు కూడా వేగంగా కోలుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్త రికవరీ రేటు 77.31 శాతంగా ఉంది. మరణాలు రేటు మరింత ఊరట కలిగిస్తూ 1.70 శాతానికి తగ్గింది.
ఇదీ చదవండి: కరోనా బాధితులకు డెంగ్యూ, మలేరియా ముప్పు